Categories
politics

తన పార్టీ గెలిచిందని నాలుక కత్తిరించి మొక్కు తీర్చుకున్న మహిళ.

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె గెలిచినందున ఒక మహిళ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి నాలుక కత్తిరించికుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ద్రావిడ మున్నేత కజగం (డిఎంకె) గెలిచిన తరువాత ఆమె ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటానికి నాలుక కత్తిరించి ఆలయ దేవతకు ఇచ్చి మొక్కుతిరుచుకుంది .ముప్పై రెండేళ్ల వనిత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె విజయానికి భరోసా ఇవ్వడానికి దేవునికి చేసిన త్యాగంగా తన నాలుకను కత్తిరించే ముందు ప్రతిజ్ఞ చేసినట్లు తెలుస్తోంది.డిఎంకె ఆదేశం గెలిచిన తరువాత, వనిత ఉదయం ముతాలమ్మన్ ఆలయానికి చేరుకుంది, ఆమె నాలుకను కత్తిరించి ఆలయ దేవతకు అర్పించడానికి ప్రయత్నించారు.కానీ ప్రార్థనా స్థలాలలో కోవిడ్-సంబంధిత ఆంక్షల కారణంగా, వనిత ఆలయ ద్వారాల వద్ద తరిగిన నాలుకను వదిలి కూలిపోయింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు.ప్రతిపక్షంలో ఒక దశాబ్దం తరువాత, డిఎంకె తమిళనాడులో ఆర్చ్-ప్రత్యర్థి ఎఐఎడిఎంకెపై విజయం సాధించింది, మరియు అధికార పార్టీ శక్తివంతమైన ప్రతిపక్షంగా ఉద్భవించింది, పదేళ్ల అధికార వ్యతిరేక భారాన్ని కొంతవరకు అధిగమించింది.ఈ వార్త విన తమిళనాడు ప్రజల అవక్ అయారు. డిఎంకె పార్టీ సభ్యులు మాత్రం పార్టీ విజేయ సంబరాలు జరుపుకుంటూనారు,

Categories
politics

ఏపీ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలకు హైకోర్టులో స్టే

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికలకు స్టే పడింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌ఈసీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ టీడీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సుప్రీం కోర్ట్ నిబంధనల మేరకు కోడ్ విధించలేదన్న హైకోర్ట్.. ఈ వ్యాఖ్యలు చేసింది. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు స్టే విధించింది.ఈ నెల 15న ఎస్ఈసీ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. విపక్షాలు వేసిన పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం 4 వారల ఎన్నికల కోడ్ అమలు చేయడంలో ఎస్ఈసీ విఫలమైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఎన్నికల సిబ్బంది, భద్రతా సిబ్బంది కేటాయింపుతో పాటు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల తరలింపు వంటి ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది.

Categories
politics

జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని హైకోర్టులో పిటిషన్ వేసిన రఘురామకృష్ణరాజు

సీబీఐ కోర్టులో ఏ1 గా ఉన్న ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ను కెన్సెల్ చేయాలి అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్మోహన్‌రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ1గా ఉన్నారని పిటిషన్‌ లో పేర్కొన్నారు, రెండు సంవత్సరాలుగా వాయిదాలకు కూడా హాజరుకావడం లేదని, ఈ కేసును త్వరగా తేల్చాలని రఘురామరాజు పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా, తమ పార్టీని కాపాడుకోవాల్సికోవాల్సిన బాధ్యత తనపైన కూడా ఉంది కాబట్టి అని ఎంపీ రఘురామరాజు ఢిల్లీలో అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు తమ నేతపై నీలాపనిందలు వేస్తున్నారని, అందుకే త్వరగా కేసుల నుంచి బయటపడి సచ్ఛీలుడిగా బయపడాలని కోరుకుంటున్నానని ఎంపీ స్పష్టం చేశారు. 

Categories
politics

ఎమ్మెల్యేని బట్టలు చింపి పరిగెత్తించి మరి కొట్టిన రైతులు

కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యేపై విచక్షణా రహితంగా దాడి చేశారు,పంజాబ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఆయనపై దాడి జరిగింది. కొందరు ఆందోళన కారులు ఆయన దుస్తులను చింపి చితకబాదారు. పోలీసులు సమక్షంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ శనివారం మలోట్ పట్టణానికి వెళ్లారు. అక్కడి బీజేపీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని అనుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. రైతులను చూసి ఎమ్మెల్యే నారంగ్‌ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు పరుగెత్తారు. వారి వెంట రైతులు కూడా వెళ్లారు. అక్కడే ఉన్న ఆందోళనకారులు ఎమ్మెల్ పై విరుచుకుపడ్డారు. ఆయన దుస్తులు చింపేసి విచక్షణా రహితంగా దాడి చేశారు,పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. బట్టలు పూర్తిగా చినిగిపోవడంతో ఆయనకు నడిరోడ్డుపై ఘోరమైన అవమానం జరిగింది. పోలీసుల భద్రత మధ్య ఆయన బీజేపీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేపై జరిగిన ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.