Categories
movies

14వ యేట బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించిన రామ్ పోతినేని.

మనందరికీ హీరో రామ్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాస్ సినిమా తో పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే,కానీ రామ్‌ పోతినేని.. తన 14 సంవత్సరాల వయసులోన ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ను సాధించాడు . ఏకంగా ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అదరగొట్టి అందర్నీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటినుండి హీరో కావాలని కలగానే రామ్ 14 వ ఏట అడయాలం” అనే తమిళ షార్ట్‌ మూవీ యాక్ట్ చేసాడు, డ్రగ్స్ కు బానిస అయిన కుర్రోడు క్యారెక్టర్ లో యాక్ట్ చేసి అందరూ చేత ఔరాాా అనిపించుకున్నాడ, అయితేేే ఈ షార్ట్ ఫిలిం ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంట్రీరీ ఇవ్వగా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు, ఇంకా తర్వాత వైవీస్ చౌదరి దేవదాస్ సినిమాతో తన ఎనర్జీ లెవల్స్ తో సూపర్ హిట్ కోట్టి వెనుతిరిగి చూసుకోకుండా తన కెరీర్ ను ముందుకు సాగించాడు , ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్లు అంటున్న రామ్ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మరారు.” అయితే 2019లో కూడా ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ మూవీ చేశాడు, రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన రెడ్ మూవీ పర్వాలేదు అనిపించింది, ప్రస్తుతం రామ్ లింగుస్వామిి దర్శకత్వంలో ఓ సినిమాా చేస్తున్నాడ, ఈ సినిమాకి ఉప్పెన ఫ్రేమ్ కృతి శెట్టి రామ్ కు జోడీగా నటిస్తుంది.

Categories
general movies

షకీలా చేసే ఈ మంచి పనులు చూస్తే….

ప్రజలకు సహాయం చేయాలనుకుంటే ఏదో విధంగా ఎవరైనా చేయొచ్చు, అలాంటి పని చేస్తు ఆకలి బాధ తీరుస్తూన సినీనటి షకీలా.ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్‌ చేయిస్తున్నాడు,ఊపిరి పోస్తున్నాడు,మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తూ దేవుడిగా మారాడు రీల్ విలన్.. రియల్ టైమ్ హీరో సోనూ సూద్, ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు నటి షకీలా. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎందరో నిరుపేదలు రోడ్డున పడుతున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారీమె. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు, అందులో ఆమె పేర్కొంటూ రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈమె ఇప్పుడు కుక్ విత్ క్లౌన్ షో అనే ప్రోగ్రాం చేస్తున్నారు, షకీలా చేసే ఈ షో లక్షల మంది ఆదరిస్తున్నారు. షకీలా ఇలాంటి మంచి పనులు ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నారు తన అభిమానులు.

Categories
movies

ఫ్యామిలీ మెన్ 2 విడుదలకు….. సమంతా ట్రోల్ అవుతుంది.

మే 19 న ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్‌ను విడుదల చేసిన మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్‌లో తీవ్ర ఎదురుదెబ్బలు ఎదుర్కొంటున్నారు. దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడును చెడు వెలుగులో చిత్రీకరించినందుకు వెబ్-సిరీస్‌ను నిందించడానికి సమాజంలోని ఒక విభాగం సోషల్ మీడియాను తీసుకుంది. ఈ ధారావాహికను ‘తమిళ వ్యతిరేక’ అని వారు ఖండించారు.”  అక్కినేని సమంత ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసింద,ఫ్యామిలీ మ్యాన్ అనే ఈ పాపులర్ వెబ్ సిరీస్‌లో సమంత ఓ కీలక పాత్రలో కనిపించనుంది, దీనికి సంబంధించి ఈ మద్యనే ట్రైలర్‌తో పాటు ఎప్పుడు స్ట్రీమింగ్ కూడా రెడీ అయింది,ఫ్యామిలీ మ్యాన్ 2 జూన్ 4 న విడుదల కానుంది, అయితే సోషల్ మీడియాలో కొంతమంది దీనిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది మరియు ఈ విహారయాత్రకు కొత్త ప్రత్యర్థి రాజీ తారాగణంలో చేరినట్లు సమంతా అక్కినేనిని చూపిస్తుంది. ఈ ట్రైలర్‌కు సానుకూల స్పందన లభించింది, అయితే సోషల్ మీడియాలో కొందరు తమిళ మూలాల నుండి ఉగ్రవాది పాత్రను పోషించినందుకు సమంతను ట్రోల్ చేస్తున్నారు. ‘ఫ్యామిలీ మ్యాన్ 2 ఎగైనెస్ట్ తమిళులు’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.ట్రైలర్‌లో సమంత లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టిటిఇ) యూనిఫాం ధరించి కనిపించింది మరియు చెన్నైలో బందీగా ఉన్న పరిస్థితి ఉందని డైలాగులు కూడా చెబుతున్నాయి. రెండవ సీజన్లో ఎక్కువ భాగం చెన్నై మరియు తమిళనాడులలో జరుగుతుందని ఒక వెబ్‌సైట్ తెలిపింది. ఏదేమైనా సోషల్ మీడియాలో ఓ వర్గం సమంతా ని వదలట్లేదు, ఈ క్యారెక్టర్లో నటించినందుకు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ott లో రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది.

Categories
movies

ఎన్టీఆర్ తన అభిమానులను అభ్యర్థిస్తూ ఒక ట్వీట్ చేశారు.

Categories
movies

శేఖర్ డాన్స్ మాస్టర్ సాయం చేస్తున్నాడు, అది ఎవరి కంటే….

“కరోనా వల్ల షూటింగ్స్ అన్నీ ప్యాకప్ అయిపోవడంతో డైలీ బేటాకు పనిచేసేవారు ఆర్థికంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, గత ఏడాది అందరి పరిస్థితి చాలా దుర్భరంగా మారింది. 2020 ఫస్ట్ వేవ్ కరోనా ఆర్థికంగా ఇబ్బందులు పడిన కాస్త కరోనా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు, ఆ టైంలో చాలా మంది దాతలు వాళ్ల తోచిన సహాయం చేసి ఆదుకునేవరు ,కాని మళ్లీ ఉప్పెనలా విజృంభించడంతో పిట్టల్లా రాలిపోతున్న కరోనా సెకండ్ వేవ్లో కొందరి పరిస్తితి దుర్భరంగా మారింది, లాక్‌డౌన్ వలన తినడానికి తిండి కూడా కరువైంది, ఇలాంటి విపత్కర పరిస్థితులలో చాలా తక్కువ మంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు,అదేవిధంగా ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చార, కరోనా వలన సినిమా షూటింగ్స్ పూర్తిగా బంద్ కావడంతో డ్యాన్సర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ మాస్టర్ డాన్సర్స్‌కు నిత్యావసర వస్తువులు అందచేస్తున్నారు. సినిమాలు, స్టేజి షోస్ చేసే డాన్సర్స్ ఎవరైనా నిత్యవసర వస్తువులు లేక ఇబ్బంది పడితే ఈ క్రింది నెంబర్ నంబర్స్ కి9989189885, 9618961492, 7416519257 ఫోన్ చేసి తీసుకోవచ్చునని తెలియజేస్తూ శేఖర్ మాస్టర్ ఓ వీడియో విడుదల చేశారు.”

Categories
general movies Uncategorized

ఇండియన్ సినిమా ప్రముఖుల్లో ఆయనదే పెద్ద సాయం.

అమితాబచ్చన్ అనే పేరు తెలియని భారతీయుడు ఎవరూ ఉండరు, 78 సంవత్సరాల వయసులోనే ఎంతో ఆరోగ్యంగా ఎనర్జీ గా ఉన్నారు అంటే ఆయన చేసే సేవ గుణమే కారణం అన్ని కొంత మంది ప్రముఖులు అంటుటారు, కరోనా కష్టకాలంలో ఇండియాలో ఉన్న అన్ని ప్రాంతాల భాషాల సినిమా కార్మికులు ఏదో విధంగా ఆయన చేత సహాయం పొందిన వారే, కరోనా మొదటి వేవ్ లో ఆయన భారతదేశంలో ప్రతి సినిమా కార్మికుడికి 1500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు,ఆయన కరోనా సహాయ చర్యల కోసం దిల్లీలోని గురుద్వారా కొవిడ్‌ సెంటర్‌కు రూ.2 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి పలువురు ప్రముఖులు ప్రశంసించారు,అదే సమయంలో సినిమా ప్రముఖులు ఎవరు కరోనా కట్టడికి ఎటువంటి సాయం చేయటం లేదని విమర్శలు వస్తున్న సమయంలో అంతా అమితాబ్ బచ్చన్ స్పందించి,కరోనా బాధితులను ఆదుకోవడానికి నాకు సాధ్యమైనంతలో సాయం చేస్తూనే ఉన్నాను,చేసిన సాయం చెప్పుకోవడం అంటే నాకు చాలా ఇబ్బందికరం అందుకే నాకు చెప్పడం కంటే చేయడమే ఇష్టం అన్నారు.ఆయన చేసిన సాయాలు చెప్పుకుంటూ పోతే జుహూలో 25-50 బెడ్ల కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు నిధులు ఇచ్చాను. చాలామంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు పీపీఈ కిట్లు, మాస్క్‌లు అందజేశాను,ముంబయిలోని ఆసుపత్రికి ఖరీదైన ఎంఆర్‌ఐ యంత్రం సోనో గ్రాఫిక్, స్కానింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది పేద రైతుల్ని ఆర్ధికంగా ఆదుకున్నాను. ఇప్పటికే 20 వెంటిలేటర్లను విదేశీ కంపెనీలకు ఆర్డర్‌ ఇచ్చాను. వాటిలో పది ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగతా పది త్వరలో రానున్నాయి’’ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేసిన సేవలు చాలా పెద్ద లిస్టే ఉంది.

Categories
general movies

కొరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో వివిధ రూపంలో సహాయం చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.

బాలీవుడ్ స్టార్లు అందరూ కోవిడ్ మీద  ఫైట్ చేస్తున్నారు, అక్షయ్ కుమార్ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కొరోనా పేషెంట్స్ కోసం తన వంతు సాయంగా ఉచితంగా ఇచ్చారు, అలాగే బాలీవుడ్ మరో స్టార్ అజయ్ దేవ్ గన్ కోవిడ్ సంబంధించిన ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కిట్స్ ని డొనేట్ చేశారు,అలాగే ఆయుష్మాన్ అనే యాక్టర్ మహారాష్ట్ర రిలీఫ్ ఫండ్ కి అమౌంట్ డొనేట్ చేశారు, అలాగే సోనుసూద్ ఈయన పేరు అసలు చెప్పనవసరం లేదు ఏదైనా కష్టం అంటే నేనున్నాను అంటారు, మనకి కరోనా ఫస్ట్ వేవ్ లో ఆయన చేసిన సహాయాని మాటల్లో చెప్పాలంటే కష్టమే, కొంతమంది వలస కూలీలు దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టుకున్నారు అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది,ఇప్పుడు free  కోవిడ్ helpline స్టార్ట్ చేశారు, అలాగే ఆన్లైన్లో ఉచిత డాక్టర్ కన్సల్టెన్సీ కూడా మొదలుపెట్టారు,ఇలా బాలీవుడ్ ప్రముఖులు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది చూసి మరి కొంతమంది ముందుకొచ్చి covid- 19 బాధితులకు వాళ్ల సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తున్నాం.

Categories
general movies

సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఏం తింటున్నాడు ఎందుకు తింటున్నాడో చూస్తే మీరు నిజంగా హ్యాట్సాఫ్ చెప్తారు.

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో మనం గమనిస్తున్నాం, ఇప్పుడు భారతదేశంలో పరిస్థితులు చెయ్యి జారి పోయినట్లే కనిపిస్తున్నాయి, రోజుకు కొన్ని లక్షల మంది కరోనా బాధితుల చూస్తున్నాం, అందులోనూ వ్యాక్సిన్ కొరత ఆక్సిజను కొరత తో చాలా ఇబ్బందులు పడుతున్నాం , ఈ సమయంలో కొంతమంది దాతలు వివిధ రూపంలో వారికి తోచిన విధంగా సహాయం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు, అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనకు తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ 5000 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసే క్రమంలో ఫుడ్ క్వాలిటీని రుచి చూసే చిత్రం మీరు చూస్తున్నారు, సల్మాన్ ఖాన్ ఫుడ్ టెస్టింగ్ చూసి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ హ్యూమన్  ఫౌండేషన్ ద్వారా రోజు ఐదువేల మందికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫుడ్ పంపిణీ చేస్తున్నారు అందులో పోలీస్ వారు మెడికల్ స్టాప్ అండ్ బిఎంసి ఎంప్లాయిస్ కూడా ఉన్నారు, ఈ ఆహార పంపిణీ మూడు వారాల నుంచి జరుగుతుంది, దాంతోపాటు టి, మినరల్ వాటర్, బిస్కెట్స్ స్నాక్స్ కూడా పంచి పెడుతున్నారు, గత ఏడాది ఇదే సమయంలో లాక్ డౌన్ లో తన ఫాంహౌస్ చుట్టూ ఉన్న విలేజ్లో వారికి ఇలాగే ఆహారం ఉచితంగా పంపిణీ చేశారు, సల్మాన్ ఖాన్ చేసే ఈ సహాయానికి ప్రజలు అలాగే ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు, ఇది చూసి ప్రముఖులు వ్యాపారస్తులు సెలబ్రిటీస్ కూడా వారికి తోచిన రూపంలో సహాయం చేయాలని ఆశిస్తున్నాం.

Categories
movies

టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ సృష్టించిన ఎన్టీఆర్ భీమ్.

బాహుబలి లాంటి భారీ రేంజ్ మూవీ తెరకి ఎకిన్చిన దర్శకధీరుడు రాజమౌళి తర్వాత మళ్ళీ అదే రేంజ్‌లో  సినిమా చేస్తున్నారు రాజమౌళి. (రౌద్రం రణం రుధిరం)ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్.టి.రామారావు, రామ్ చరణ్ తేజ, అలియా భట్, అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

ఈRRR మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. కాగా గతేడాది 22 అక్టోబర్ 2020 సంవత్సరం నా రిలీజ్ అయిన టీజర్ రికార్డ్లు సృష్టిస్తూనే ఉంది,50 మిలియన్ వ్యూస్ వచ్చిన తొలి తెలుగు సినిమా టీజర్ గా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించాడు.

Categories
movies

ఎంత దారుణం రిలీజ్ రోజే సూపర్ హిట్ వకీల్ సాబ్ మూవీ పైరసీ లోకల్ ఛానల్ లో ప్రసారం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ళ తర్వాత వెండితెర పై కనిపించరు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ గా సందడి చేశారు.ప్రపంచ వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. విడుదల అయిన అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో ఫ్యాన్స్ జల్సా చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. సినిమాను వివాదాలు వెంటాడాయి. అనకాపల్లి నుంచి అమీర్ పేట వరకు వకీల్ సాబ్ రిలీజ్ తో ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు. మూడేళ్ల తరువాత పవర్ స్టార్ ను స్క్రీన్ మీద చూసి సంబర పడిపోతున్నారు. మరోవైపు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. బాక్సాఫీసు రికార్డులు బద్దలు అవుతున్నాయి.సోల్ ఉన్న కథ ప్రేక్షకుడ్ని ఎప్పుడూ డిజప్పాయింట్ చేయదు. వకీల్ సాబ్ చిత్రం కూడా అలాంటిదే. తెరపై వాస్తవ జీవితాన్ని చూపించే చిత్రాలు అరుదుగా వస్తాయి. అనాదిగా స్త్రీ యొక్క ఆలోచనలను, హక్కులను, స్వేచ్ఛని అణిచివేస్తున్న అనేక అంశాల్ని నిక్కచ్చిగా కోర్టు బోనులో నిలబెట్టి మరీ నిగ్గుతేల్చాడు వకీల్ సాబ్. ఈ సినిమా కథ.

https://youtu.be/TMIC-WyNw0s

అయితే రిలీజ్ అయిన రోజునే ఈ మూవీ టీవీలో ప్రసారం అయింది,  ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయనగరంలోని ఓ కేబుల్ ఛానల్లో ఈ సినిమా ప్రసారం అయిందని…  ఈ సంఘటన పై చర్యలు తీసుకోవాలని పవన్ ఫ్యాన్స్ నిర్మాత దిల్ రాజును కోరారు.టెలికాస్ట్ అయిన ఛానల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.