Categories
home

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జయరాం మృతి, ఎన్టీఆర్ ఏఎన్నార్ నుంచి అల్లరి నరేష్ కృష్ణుడు వరకు..

కరోనా సెకండ్ వేవ్ ఎంత ఆలా విజృంభిస్తున్న మనం చూస్తూనే ఉన్నాం, కరోనా సెకండ్ వేవ్ లో మనం చాలా మంది ప్రముఖుల్ని కోల్పోవడం చూశాం, ముఖ్యంగా సినిమా రంగంలో చాలా మంది ప్రముఖులు చనిపోయారు,తాజాగా మే 21 తెల్లవారు జామున సీనియర్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం కోవిడ్ కార‌ణంగా తుదిశ్వాస విడిచారు,ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది, అయితే చికిత్స తీసుకుంటూనే ఆయన ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస విడిచారు. జయరాం గారి స్వస్థలం వరంగల్, ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ తోనే కాకుండా మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి వంటి అగ్ర నటులు తో కలిసి పని చేశారు,ఇటు తెలుగు, అటు మలయాళం సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా స‌త్తా చాటరు ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక చిత్రాల‌కు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేశారు, బ్లాక్ బాస్ట‌ర్ ‘పెళ్లి సందడి’ చిత్రానికి కూడా ఆయ‌నే సినిమాటోగ్రాఫర్‌. జై రాం గారు ఈ తరం నటులు అల్లరి నరేష్ కృష్ణుడు ఇలా చాలా మంది కొత్త నటులతో కలిసి పని చేశారు. ఏమైతేనేమి చివరకు ఒక మంచి సినిమాటోగ్రాఫర్ ని తెలుగు చిత్ర సీమ కోల్పోయింది.

Categories
general home

ఒక గ్రామం కోసం 12 గ్రామాలు పాకిస్తాన్ కు ఇచ్చేసిన భారత్

భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే  పరిస్థితులు ఉన్నాయి,  అది ఇది ఏమీ లేదు చిన్న కారణం దొరికితే చాలు పాకిస్తాన్ ఇండియా వైపు కాలు దువ్వుతూ నే ఉంటుంది, ముఖ్యంగా కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఈ వివాదాలు పక్కన పెడితే. మన దేశం కాంప్రమైజ్ ఒక గ్రామం కోసం 12 గ్రామాలను పాకిస్తాన్ కి ఇచ్చేసింది, ఇది నిజమే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల చాలా పెద్ద కారణమే ఉంది, భారత దేశానికి పాకిస్తాన్ కి సరిహద్దు సమీపంలో వొసని వాలా అనే గ్రామం ఉంది, ఇది ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్ పూర్ జిల్లా సరిహద్దు లోకి వస్తుంది. భగత్ సింగ్, సుకుదేవ్, రాజ్ గురు సమాధులు ఈ గ్రామంలోనే ఉన్నాయి, అలాగే పంజాబ్ మాత బిరుదు పొందిన భగత్ సింగ్ తల్లి విద్యావతి సమాధి కూడ  ఈ గ్రామంలోనే ఉన్నది, అయితే ఈ గ్రామం దేశ విభజన  అనంతరం పాక్ భూభాగంలోని కి వెళ్ళిపోయింది. దానితో భారతదేశం తన 12 గ్రామాలు పాక్ ఇచ్చి ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుంది. ఈ గ్రామం స్వతంత్ర సమరయోధులు, అమరవీరులు గుర్తులు  ఉన్న చరిత్రాత్మక కావడం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.