Categories
crime

విశాఖలో నిత్య పెళ్లి కొడుకు అరుణ్‌కుమార్ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని……

విశాఖపట్నంలో ఓ నిత్య పెళ్ళికొడుకు వ్యవహారం తాజాగా బుధవారం వెలుగు చూసింది. బాధిత మహిళలు మహిళ చేతన కార్యదర్శి కత్తి పద్మను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగు చూసింది.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మందిని పెళ్లి చేసుకుని, కొన్నాళ్ళు వారిపై కోరిక తీర్చుకుని, ఆపై వ్యభిచార కూపంలోకి నెడుతున్న మోసకారి అయిన యువకుడి గుట్టురట్టయింది.అరుణ్ కుమార్ వేధింపులతో విసిగిపోయిన మొదటి భార్య గీతాంజలి, రెండో భార్య లక్ష్మి భర్త ఆగడాలు భరించలేక కంచరపాలెం పోలీసులను ఆశ్రయించారు . అయితే స్థానిక పోలీసులకు, అరుణ్ కుమార్ కు సంబంధం ఉన్న నేపథ్యంలో బాధితులు ఫిర్యాదు చేసిన అరుణ్ కుమార్ పై చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపిస్తూ తమకు న్యాయం చెయ్యాలని మహిళా సంఘాలను ఆశ్రయించారు. దీంతో మహిళా సంఘాలు ఈ విషయాన్ని సిపి మనీష్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో గంజాయి దందా సాగించిన ఇతనిపై పలు కేసులు కూడా ఉన్నాయి . గంజాయి ముఠా తో పాటు వ్యభిచార ముఠా తో కూడా సంబంధాలు పెట్టుకున్న అరుణ్ కుమార్ తాను పెళ్లి చేసుకున్న భార్యలను వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేశావాడు.ఆర్థికంగా నష్టపోయానని చెప్పి భార్య గీతాంజలిని, స్నేహితుడు భార్య లక్ష్మిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తూ, రోజూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. సొంత కుమార్తె కీర్తి(9)ని అమ్మేస్తానని . నిత్యం తుపాకి, పదునైన కత్తితో తిరుగుతూ తనకు అడ్డు చెప్పేవారిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు . ఎక్కడ ఏ కొత్త మారణాయుధం వాడినా, సినిమాలలో వేటిని చూసినా అటువంటి మారణాయుధాలను తయారు చేయించుకుని బెదిరించడం అరుణ్ కుమార్ కు అలవాటు.దీనిపై స్పందించిన సిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. అరుణ్ కుమార్ వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా అతని ఆగడాలపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ReplyForward