Categories
crime

పుట్టింటికి వెళ్ళొస్తా అన్న భార్య…. తీరా చూస్తే 19 వ పెళ్లి చేసుకుంది….

చైనా దేశంలో ఒక వ్యక్తికి తన భార్య దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చింది. అమ్మ గారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య తీరా చూస్తే ఆన్‌లైన్‌లో కనబడేసరికి షాక్ అయ్యాడు, ఈ క్రమంలో పోలీసుల్ని కలవగా ఆయనకు ఆశ్చర్య పోయే నిజాలు బయటపడ్డాయి. వివరాలు చూస్తే:

ఇన్నర్ మంగోలియాలోని బయన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి, ఎదురు కట్నమిచ్చి మన భారత కరెన్సీ లో అక్షరాల 16 లక్షలు చెల్లించి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు,యువతి ఇంట్లోని కొన్నిసమస్యల కారణంగా సదరు వ్యక్తి తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి కుదరలేదు,ఈ క్రమంలో భర్త అంగీకారంతో పెళ్లైన కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లింది, అలా పుట్టింటికి వెళ్లిన భార్యను అనుకోకుండా నెట్లో ఒక వీడియో చూసి ఆ భర్త షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకునేే దృశ్యాలను చూసి షాక్ కి గురయ్యాడు . వెంటనే సదరు వ్యక్తి తన భార్యకు ఫోన్‌ చెయ్యగా ఎటువంటి స్పందన లేకపోవడంతో వాళ్ళ అత్తమామలు కూడా ఫోన్ చేశాడు, వాళ్లు కూడా ఏమీ స్పందించకపోవడంతో వెంటనే తన భార్య ఉన్న గ్రామానికి బయలుదేరాడు,అక్కడ అతని భార్య వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడం నిజమే అని ఆన్‌లైన్ తాను చూసిన దృశ్యాలు నిజమేనని తెలుసుకుని నివ్వెరపోయాడు. ఏమి చేయాలో అర్థం గాక దగ్గర్లో ఉన్న పోలీసులను ఆశ్రయించాడు, పోలీసుల దర్యాప్తులో కొన్నిిి సంచలనమైన నిజాలు బయటపడ్డాయి, ఈమె అప్పటికేేేేే 19 పెళ్లిళ్లు చేసుకుందని, అందర్నీ నీలాగేేే పెళ్లి చేసుకునిమోసం చేస్తుందని, ముఖ్యంగా వయసు ముదిరిన వారిని సెలెక్ట్ చేసుకుని ఎదురు కట్నాలు తీసుకొని ఇలా ఎన్నో మోసాలుకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మోసానికి పాల్పడిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

Categories
crime

మొగుడి దగ్గర 60 లక్షలు బంగారం దొబ్బేసిన పెళ్ళాం.

ఒక ఇంట్లో భారీగా బంగారం చోరీ జరిగింది. అది తెలుసుకున్న ఇంట్లో మనిషి పోలీసులుకి కంప్లీట్ ఇవ్వగా, ఈ దొంగతనానికి తన భార్య అని షాకింగ్ న్యూస్ బయటపడింది, ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది, వివరాల్లోకి వెళితే..

శివ ప్రకాష్ అర్చనలకు 2008లో పెళ్లయింది, వీళ్లది ఖమ్మం జిల్లా కారేపల్లి. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు, వీళ్లిద్దరి మధ్య తరచు గొడవ పడుతూ అది బాగా పెరిగి పెద్దదై అర్చన తన భర్త దూరంగా గుంటూరులో తల్లి దగ్గర ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటుంది.ఈ సమయంలోనే కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తికి దగ్గరై అతడితో వివాహేతర సంబంధానికి తెర తీసింది,ఇదిలా ఉంటే నెల రోజుల క్రిందట తన అత్త చనిపోయిన సమాచారం రాగా భర్త వద్దకు వెళ్ళింది అర్చన, అప్పుడే ఇంట్లో ఉన్నా వెండిని బంగారాన్ని గమనించిన అర్చన, వాటిని ఎలాగైనా చోరీ చేయాలని ప్లాన్ రచించింది, దానికోసం ప్రియుని సంప్రదించి అతని ఊరికి రప్పించి భర్త నిద్రపోతున్న సమయంలో అతడు దగ్గర ఉన్న లాకర్ తాళం తీసుకుని అందులో ఉన్న వెండి బంగారాన్ని ప్రియుడితో కలిసి దోచేసింది. కానీ ఇంట్లో చోరీ గమనించిన శివ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితున్ని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది, ఈ చోరీ ప్లాన్ వేసింది తన భార్య అర్చన అన్న నిజం బయటకు వచ్చింది.

Categories
crime general

ఒకే రోజు 12 మందికి ఉరిశిక్ష వేస్తూ తీర్పు ఇచ్చిన కోర్ట్

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 12 మందికి ఉరిశిక్ష విధించింది.”2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది, పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు”.దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు,పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు,సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం గాలింపు చేపట్టారు,దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు,ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిల్లర్ మున్నాను అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అనేక సంవత్సరాలు ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.  కిల్లర్ మున్నా గ్యాంగ్ 12 మందికి ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది.  

Categories
crime

శవాల మీద దుస్తులు కొట్టేస్తున్న ముఠా అరెస్ట్.

ఈ కరోనా కాలంలో ఇలాంటి ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో,…కరోనా రోగుల నుంచి వైద్యం పేరిట ఆసుపత్రులు దోచుకోవడం చూసాం. కొన్నిచోట్ల కరోనా బాధితుల నగలు డబ్బులు దొంగతనం చేయడం గురించి విన్నాం,కానీ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ ముఠాది దందా వింటుంటేనే బుర్ర పాడయ్యే దందా చేస్తున్నారు! కరోనాతో మరణించిన వారి దుస్తులు దొంగిలించడం, వాటిని ఉతికి మళ్లీ తిరిగే కొత్త దానిలా అమ్మడం వీరి పని, ఈ విధంగా శ్మశానవాటికల్లో దొంగతనాలు చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను యూపీలోని ‌ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేయగా.కొవిడ్‌ మృతదేహాలపై కప్పిన దుప్పట్లో సహా, బేడీషీట్లు , కుర్తాలు, ఇతర వస్తువులను ఈ ముఠా సభ్యులు దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు, వీరి నుంచి మొత్తం 520 దుప్పట్లో, 52 చీరలు, 127 కుర్తాలు, కూడిన మూటలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు తెలిపారు. ఇలా చోరీ బట్టలను బాగా ఉతికి కొత్త దుస్తులు లాగా తయారుచేసి విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు. స్థానికంగా ఉండే వ్యాపారులు ఇలాంటి వారితో డీల్‌ కుదుర్చుకుని, అరెస్టయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు వారిపై అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Categories
crime

9 సంవత్సరాల బాలిక రేప్..!పరిహారంగా ఎకరం భూమి సెటిల్ చేస్తున్న గ్రామపెద్దలు.

తెలంగాణ: దిశాలాంటి కఠినమైన చట్టం తీసుకొచ్చినా అత్యాచారాలు,గృహహింసలు ఆగడం లేదు. 21 రోజుల్లోనే మరణశిక్ష విధిస్తామంటున్నా కామాంధులు అసలు భయపడడం లేదు. అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది.పసి పిల్లల నుండి వయసు మళ్ళిన వృద్ధులపై వరకు మృగాళ్ల పైశాచికంలో మార్పు రావడం లేదు తాజాగా తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో బాలికపై ఘోరం జరిగింది.

ఓ మనవ మృగం  తొమ్మిది సంవత్సరాల బాలికపై అత్యాచారం చేయగా పంచాయతీ పెద్దలు ఎకరం భూమి పరిహారం ఇచ్చి నేరాన్ని మాఫీ చేయాలనుకున్నారు. అయితే.. తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి విలువ కట్టడం సహించలేని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా సమీపంలోనే నివాసముండే ముపై ఐదు ఏళ్ల ఓ వ్యక్తి మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు, విధిలో ఆడుకుంటున్న బాలిక కనిపించకపోవడంతో వెతికిన బాలిక తల్లిదండ్రులు జరిగిన దారుణాన్ని తెలుసుకొని నిందితుని పట్టుకున్నారు, ఈ విషయం గ్రామంలోని పంచాయితీ పెద్దలకు తెలియడంతో పంచాయితీ నిర్వహించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు,జరిగిన అత్యాచారానికి పరిహారంగా భాదితురాలి కుటుంబానికి ఎకరం భూమి ఇప్పిస్తామని తీర్పు చెప్పాగా తమ బిడ్డకు జరిగిన అన్యాయానికి పంచాయతీ పెద్దల తీర్పుకు సాహిమచలేని తల్లిదండ్రులు స్థానిక ఆలంపూర్ పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేయగా పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

Categories
crime

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.

యాంకర్ శ్యామల భర్తను హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు,మహిళ నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.తన వద్ద కోటి రూపాయలు తీసుకుని ఇవ్వడం లేనది ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది,2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలిపింది. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది,కాగా ఇదే విషయంపై సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది,ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసుల నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 

Categories
crime

కన్న కొడుకుని చదువుకోమని మందలించినందుకు తండ్రిని హత్య చేసిన కొడుకు

తల్లిదండ్రులు ఎప్పుడు తన పిల్లల బాగు కోసం ఆలోచిస్తూ ఉంటారు, చాలామంది వాళ్ళ ఫ్యూచర్ అంతా తమ పిల్లల కోసమే అని అనుకుంటారు, వాళ్ల కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తుంటారు, కానీ దాని సరిగ్గా అర్థం చేసుకోలేని పిల్లల ఇలాగే తల్లిదండ్రులు మాటలు అర్థం చేసుకోక  తొందరపాటు పనులకు పాల్పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, చదువుకోవాలని మందలించినందుకు ఓ కుమారుడు కన్నతండ్రినే కత్తెరతో గొంతులో పొడిచి చంపాడు, ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం పాములపాడులో బుధవారం చోటుచేసుకుంది. ఈ ఘటన నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపహాడ్​లో జరిగింది. స్థానికులు, వేములపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.గ్రామానికి చెందిన రైతు బంటు ఎల్లయ్య (45)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.నాగేందర్ ​సూర్యాపేటలో ఇంటర్​ ​సెకండ్​ఇయర్​చదువుతున్నాడు. బుధవారం ఎల్లయ్య కొడుకును చదువుకోమని చెప్పాడు. ఆ విషయంలో ఇద్దరికీ గొడవ జరిగింది.ప్రస్తుతానికి కరోనా ఉండటం వల్ల కాలేజీ సెలవులతో ఇంటి వద్దే ఉన్నాడు, ఎల్లయ్య దంపతులు ఎప్పటిలాగే బుధవారం కూడా పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు, ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్న కుమారుడు చూసి చదువు లేదు నాకు వ్యవసాయంలో తోడు సాయం లేదు అని మందలించగా , తండ్రి మాటలతో విచక్షణ కోల్పోయినా నాగేంద్ర తండ్రి తో ఘర్షణ కి దిగి ఆవేశంతో  దగ్గరలో  ఉన్న కత్తెరతో తండ్రిని గొంతులో బలముగా పోడవగా ఎల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు, చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు, పోలీసులు నాగేంద్ర ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Categories
crime

మరి ఇంత ఘోరమా ఆరు నెలల చిన్నారి ని గొంతు కోసి చంపిన కన్నతల్లి

చిత్తూరు జిల్లా మదనపల్లి ఘటన మళ్లీ రిపీట్‌ అయ్యింది. మూఢనమ్మకం ముక్కపచ్చలారని ఓ చిన్నారి ప్రాణం తీసింది,ప్రపంచం మొత్తం మారుతున్న కొందరు జనాల తీరు మాత్రం మారడం లేదు,యావత్ ప్రపంచం సైన్స్‌ను ఆసరాగా చేసుకుని అభివృద్ధి పథంవైపు దూసుకుపోతుంటే.. ఇక్కడ మాత్రం పాతకాలం నాటి మూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్నాఅవేవీ పట్టడం లేదు. ఈ మూఢనమ్మకాల పిచ్చిలో కన్న బిడ్డలను సైతం చంపెస్తునారు, ఇలాంటి సంగటన రోజూ ఎదో ప్రదేశంలో వెలుగు చూస్తూనే ఉనము,తాజాగా ఇలాంటి ఉదంతమే తెలంగాణలోని సూర్యపేట జిల్లా మేకలపాడు తండాకు చెందిన బానోత్‌ బుజ్జికి అదే తండాకు చెందిన కృష్ణతో రెండేళ్ల కిందట పెళ్లైంది. వీరికి ఆరు నెలల పసిపాప ఉంది ఇదిలా ఉండగా బుజ్జి సోషల్‌ మీడియాలో ఆధ్యాత్మిక వీడియోలకు అడిక్ట్‌ అయ్యింది, ఓ క్రమంలో తానే శివుడిగా భావిస్తూ ఉండేది. ఈ తండాకు వచ్చిన ఓ సాధువు ఆమెకు నాగదోషం ఉందని చెప్పాడు, ఈ వ్యాఖ్యమే ఆ పసి బిడ్డ పాలిట శాపమైంది ఆ సాధువు చెప్పిన నాటి నుంచి నిత్యం పూజలతోనే గడిపేది. నెమ్మదిగా ఆమె మానసికస్థితి మూఢవిశ్వాసానికి బానిసైంది.శివుని బొమ్మను పక్కన పెట్టుకుని ఆరు నెలల పసిపాప గొంతు కోసి చంపేసింది. అదేమంటే నాగసర్ప దోష నివారణ కోసం అంటూ బుకాయించింద ఆ రోజు భర్త కృష్ణ పని మీద సూర్యాపేటకు వెళ్లాడు ఇదే అదునుగా భావించిన బుజ్జి తన కూతురు రీతును దేవుడి పటం ముందు పడుకోబెట్టి బ్లేడుతో గొంతు కోసింది తర్వాత ఏమీ తెలియనట్టు తన పుట్టింటికి వెళ్లింది బిడ్డ ఎక్కడని బుజ్జి తల్లి ప్రశ్నించింది మౌనంగా ఉండడంతో అనుమానం వచ్చిన బుజ్జి తల్లి ఇంటికి వెళ్లి చూసింది, ఆ ఇంట్లో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి ఉలిక్కిపడింది.విషయం తెలుసుకున్న పోలీసులు తండాకు చేరుకొని పంచనామా నిర్వహించారు. బంధువుల ఫిర్యాదు మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Categories
crime

భార్యను తానే చంపానని ఒప్పుకున్నాడు…కానీ మృతదేహం 1600 సంవత్సరాల క్రితంది

ఈ సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారింది ఓ మర్డర్ కేస్ విచారణలో మతిపోయే విషయాలు బయటపడ్డాయి, ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఇప్పటిది కాదు చాలా పురాతనమైనది, పురాతనమైనది అంటే 1600 సంవత్సరాల క్రితం ది,ఈ సంఘటన ఇప్పటిది కాదు 1959 లో జరిగింది, ఆమె పేరు మలైకా డీ ఫెర్నాండెజ్ చిత్రాలు గీసే ఆర్టిస్ట్ పైగా ట్రావెలర్ ఈ క్రమంలో ఓ సారి జర్నీలో ఆమెకు పీటర్ రెన్ బార్డ్ అనే ఎయిర్ లైన్ ఉద్యోగి పరిచయం అయ్యాడు.అ పరిచయం ప్రేమగా మారింది తనను పెళ్లి చేసుకోవాలని పీటర్ మలైకా ఓకే చెప్పడంతో నాలుగు రోజుల్లో వివాహం అయిపోయింది.

పెళ్లి చేసుకునే నాలుగు నెలలు తర్వాత పెళ్లి విడాకులు అయింది, ఆ తర్వాత ఎవరి పని వారు చూసుకున్నారు, మలైకా ఎప్పుడు లాగే ప్రపంచ పర్యటన మొదలు పెట్టింది పీటర్ తన కాటేజ్ లోనే ఉండు సాగాడు, ఇది జరిగిన రెండు సంవత్సరాలు తర్వాత మలైకా అదృశ్యమయింది మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా మాజీ భర్త పీటర్ ని అనుమానించారు,  పీటర్ ఇంట్లో సోదాలు చేయగా మలైకా కి సంబంధించిన ఏ ఆధారం దొరకలేదు, అలా ఆ కేసు 20 సంవత్సరాలు పాటు మిస్టరీగానే మారిపోయింది,ఈ క్రమంలో పీటర్ కాటేజీకి సమీపంలోని నేలలో(పీట్ బాగ్) శరీర భాగాలు దొరికాయి. దీంతో మళ్లీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు ,పీటర్ ని అదుపులోకి తీసుకుని విచారించాగా. తానే మలైకాని మర్డర్ చేసినట్లు విచారణలో పీటర్ అంగీకరిచాడు. పీట్ బాగ్ నేలను సేంద్రీయ పదార్ధం, నాచుతో చేస్తారు,ఈ తరహా నేలలో యాసిడ్ ఉంటుంది. మృతదేహాల పడుఅవకుండా బాగా ఉపయోగపడుతుంది,ఆ నేల నుంచి పోలీసులు ఓ మహిళ తల సేకరించారు. అది మలైకాదే అని భావించాగా ఆ తలబాగని ల్యాబ్ కి పంపి టెస్టులు నిర్వహించారు. టెస్టులో వారికి షాకింగ్ మతి పోయే విషయం తెలిసింది. ఆ మృతదేహం ఇప్పటిది కాదు అని1600 ఏళ్ల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలుసుకున్నారు,1600ఏళ్లు దాటినా ఇంకా ఆ పుర్రె పాడవకుండా ఉండటం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

ఆ పుర్రె తన మాజీ భార్యది కాదనే విషయం తెలియగానే.. పీటర్ రివర్స్ డ్రామా ఆడాడు , తాను ఆమెని హత్య చేయలేదని చెప్పాడు. కానీ పోలీసుల ముందు అతడి ఆటలు సాగలేదు. మలైకాను తానే గొడ్డలితో నరికి చంపినట్టు ఒప్పుకున్నాడు ,విడిపోయిన తర్వాత మలైకి రోజూ తన రూమ్కి వచ్చేదని తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నేను గే అనే విషయాన్ని బయటపెడతానని నను బెదిరించేది అని చెప్పాడు. ఇంగ్లండ్ లో గే అనేది చట్టరిత్యా నేరం. దీంతో విసిగిపోయిన తాను ఆమెని హత్య చేశానని ఒపుకునాడు.మొతానికి ఆ తల ఓ మహిళదే కానీ, ఇప్పటిది కాదు. 1600 ఏళ్ల క్రితమే చనిపోయింది దీనిపై ల్యాబ్ లో పరిశోధనలు జరపగా ఆ పుర్రె రోమన్ సమయానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పరిసోదుకులు.

Categories
crime

అనుకున్న దానికన్నా ఎక్కువ దొంగతనం చేయడంతో సంతోషం పట్టలేక దొంగకి గుండెపోటు

తాను ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బు దోచుకున్నాని దొంగకు సంతోషం పట్టలేక గుండెపోటు వచ్చింది, దానితో తను చోరీ చేసిన డబ్బుల్లో ఎక్కువ శాతం వైద్యం కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఈ దొంగ మరొకరితో కలిసి గత నెలలో ఓ పబ్లిక్ సర్వీస్ సెంటర్ లో దొంగతనం చేశాడు, ఆ తర్వాత అక్కడి నుండి ఎస్కేప్ అవగా, ఇంకా దొంగతనం చేసిన డబ్బులు పంచుకుందాం అని   డబ్బులు లెక్కించగా ఏడు లక్షల రూపాయలు దొంగతనం చేసినట్లు గుర్తించారు. అయితే తాము అనుకున్న దానికన్నా ఎక్కువ దొంగతనం చేశామని ఆనందంతో అందులో ఒక దొంగ గుండెపోటు వచ్చింది, దానితో అతనితోపాటు దొంగతనానికి వచ్చిన మరో వ్యక్తి అతను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందించారు, అతను దొంగతనం చేసిన డబ్బుల్లో చాలా వరకు ఆసుపత్రికి కట్టవలసి వచ్చిందని దొంగ చాలా బాధపడ్డాడు అంట, దొంగతనం జరిగిన తర్వాత పబ్లిక్ సర్వీస్ యాజమాని ఫిర్యాదు చేశారు, ఆ దొంగలు 7 లక్షలు చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విలనీ వెదకడం మొదలు పెట్టిన పోలీసులు చివరికి పట్టుకున్నారు, వీళ్ళ దొంగతనం చేసిన సొమ్ము గురించి అరా తీయగా ఈ విషయం బయటకు వచ్చింది.