Categories
general

రైతు పొలంలో అరకేజీ బంగారు విగ్రహం దొరికింది, తీరా చూస్తే పాపం……

రైతు తన పొలంలో తవ్వకాలు తవ్వగా అరకేజీ దేవుడు రూపంలో ఉన్న బంగారం విగ్రహం దొరికింది,దాని మల్లన్న దేవుడిగా భావించి ఇంటి వద్ద పూజలు చేయడం మొదలు పెట్టాడు,అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో అధికారుల దృష్టికి వెళ్ళింది. విచారణ చేపట్టారు,ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది,బిల్ల నారాయణ అనే వ్యక్తి బుట్టాయిగూడెంకు చెందిన వ్యక్తితో కలిసి తన పొలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపాడు. ఈ తవ్వకాల్లో 500 గ్రాముల బంగారు మల్లన్న దేవుడి విగ్రహం దొరికింది,పొలంలో లభ్యమైన బంగారు విగ్రహం మల్లన్న దేవుడిదిగా అనుమానిస్తున్నారు.అయితే ఈ విషయం బయటకు తెలియడంతో పోలీసులకు కూడా సమాచారం అందింది, దీంతో అది తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఆ పొలంలో ఇంకా గుప్త నిధులు ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలంలో మరిన్ని తవ్వకాలు చేయాలని భావిస్తున్నారు. అరకేజీ బంగారం దొరికింది అని సంబరపడే లోపే పాపం రైతుకి ఆశ కాస్త నీరాస అయింది.

Categories
crime

పుట్టింటికి వెళ్ళొస్తా అన్న భార్య…. తీరా చూస్తే 19 వ పెళ్లి చేసుకుంది….

చైనా దేశంలో ఒక వ్యక్తికి తన భార్య దిమ్మ తిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చింది. అమ్మ గారి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పిన భార్య తీరా చూస్తే ఆన్‌లైన్‌లో కనబడేసరికి షాక్ అయ్యాడు, ఈ క్రమంలో పోలీసుల్ని కలవగా ఆయనకు ఆశ్చర్య పోయే నిజాలు బయటపడ్డాయి. వివరాలు చూస్తే:

ఇన్నర్ మంగోలియాలోని బయన్నూర్‌కు చెందిన ఓ వ్యక్తి, ఎదురు కట్నమిచ్చి మన భారత కరెన్సీ లో అక్షరాల 16 లక్షలు చెల్లించి ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు,యువతి ఇంట్లోని కొన్నిసమస్యల కారణంగా సదరు వ్యక్తి తన వివాహాన్ని రిజిస్టర్ చేసుకోవడానికి కుదరలేదు,ఈ క్రమంలో భర్త అంగీకారంతో పెళ్లైన కొద్ది రోజులకే భార్య తన పుట్టింటికి వెళ్లింది, అలా పుట్టింటికి వెళ్లిన భార్యను అనుకోకుండా నెట్లో ఒక వీడియో చూసి ఆ భర్త షాక్ అయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకునేే దృశ్యాలను చూసి షాక్ కి గురయ్యాడు . వెంటనే సదరు వ్యక్తి తన భార్యకు ఫోన్‌ చెయ్యగా ఎటువంటి స్పందన లేకపోవడంతో వాళ్ళ అత్తమామలు కూడా ఫోన్ చేశాడు, వాళ్లు కూడా ఏమీ స్పందించకపోవడంతో వెంటనే తన భార్య ఉన్న గ్రామానికి బయలుదేరాడు,అక్కడ అతని భార్య వేరే వ్యక్తిని వివాహం చేసుకోవడం నిజమే అని ఆన్‌లైన్ తాను చూసిన దృశ్యాలు నిజమేనని తెలుసుకుని నివ్వెరపోయాడు. ఏమి చేయాలో అర్థం గాక దగ్గర్లో ఉన్న పోలీసులను ఆశ్రయించాడు, పోలీసుల దర్యాప్తులో కొన్నిిి సంచలనమైన నిజాలు బయటపడ్డాయి, ఈమె అప్పటికేేేేే 19 పెళ్లిళ్లు చేసుకుందని, అందర్నీ నీలాగేేే పెళ్లి చేసుకునిమోసం చేస్తుందని, ముఖ్యంగా వయసు ముదిరిన వారిని సెలెక్ట్ చేసుకుని ఎదురు కట్నాలు తీసుకొని ఇలా ఎన్నో మోసాలుకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే మోసానికి పాల్పడిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

Categories
movies

14వ యేట బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించిన రామ్ పోతినేని.

మనందరికీ హీరో రామ్ వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో దేవదాస్ సినిమా తో పరిచయమైన సంగతి అందరికి తెలిసిందే,కానీ రామ్‌ పోతినేని.. తన 14 సంవత్సరాల వయసులోన ఏ హీరోకు సాధ్యం కాని రికార్డు ను సాధించాడు . ఏకంగా ఓ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోనే అదరగొట్టి అందర్నీ ఆకట్టుకున్నారు. చిన్నప్పటినుండి హీరో కావాలని కలగానే రామ్ 14 వ ఏట అడయాలం” అనే తమిళ షార్ట్‌ మూవీ యాక్ట్ చేసాడు, డ్రగ్స్ కు బానిస అయిన కుర్రోడు క్యారెక్టర్ లో యాక్ట్ చేసి అందరూ చేత ఔరాాా అనిపించుకున్నాడ, అయితేేే ఈ షార్ట్ ఫిలిం ఈ యూరోపియన్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంట్రీరీ ఇవ్వగా బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు, ఇంకా తర్వాత వైవీస్ చౌదరి దేవదాస్ సినిమాతో తన ఎనర్జీ లెవల్స్ తో సూపర్ హిట్ కోట్టి వెనుతిరిగి చూసుకోకుండా తన కెరీర్ ను ముందుకు సాగించాడు , ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్లు అంటున్న రామ్ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మరారు.” అయితే 2019లో కూడా ఇస్మార్ట్ శంకర్ అనే సూపర్ హిట్ మూవీ చేశాడు, రీసెంట్ గా సంక్రాంతికి వచ్చిన రెడ్ మూవీ పర్వాలేదు అనిపించింది, ప్రస్తుతం రామ్ లింగుస్వామిి దర్శకత్వంలో ఓ సినిమాా చేస్తున్నాడ, ఈ సినిమాకి ఉప్పెన ఫ్రేమ్ కృతి శెట్టి రామ్ కు జోడీగా నటిస్తుంది.

Categories
general

ఒక అమ్మాయి వెనకాల వెళ్లి పాకిస్తాన్లో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన విశాఖపట్నం ప్రశాంత్

పాకిస్తాన్లో తన ప్రియురాలి కోసం అడుగు పెట్టి నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించి సోమవారం విడుదలైన ప్రశాంత్.“నాలుగేళ్లపాటు జైలులో శిక్ష గడిపిన ఆయన్ను అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు.”ఆంధ్రప్రదేశ్ లోని, విశాఖపట్నంకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రశాంత్ ప్రేమలో విఫలమై తన ప్రేయసిని వెతుక్కుంటూ స్విట్జర్లాండ్ వెళ్లేక్రమంలో పాకిస్థాన్ లో ప్రియురాలిని కలుసుకునే ప్రయత్నంలో నాలుగేళ్ల క్రితం అనుకోకుండా పాక్ భూభాగంలోకి అడుగుపెట్టాడు హైదరాబాద్ పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే,అయితే అతడికి వీసాలేదు. దీంతో పాకిస్తాన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి ఖైదు చేశారు. ప్రశాంత్ గూఢాచారి కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అతడి దగ్గర సరైన ఆధారాలు లభించక జైల్లో పెట్టారు.” హైదరాబాద్్ పోలీసులు ఈ విషయాన్ని విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి పాకిస్తాన్ అధికారులతో సంప్రదింపులు జరిపేలా చేశారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించడంతో పాకిస్తాన్ ప్రశాంత్‌ను విడుదల చేసింది. వాఘా సరిహద్దులో పాక్ అధికారులు ప్రశాంత్‌ను భారత అధికారులకు అప్పగించారు,అక్కడినుంచి అధికారులు ప్రశాంత్‌ను హైదరాబాద్ పోలీసులు ప్రశాంత్‌ను నగరానికి తీసుకుని వచ్చి . తర్వాత సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రశాంత్‌ను అతని తల్లిదండ్రులకు అప్పగించారు.ప్రశాంత్‌ విడుదలకు సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశాంగ శాఖ అధికారులకు సజ్జనార్‌ కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ల తల్లిదండ్రులు కొడుకు తిరిగి రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు, తన కుమారుడి తిరిగి రావడానికిిిిిిి కారణమైన ప్రతి ఒక్కరికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు.

ఇంతకి ప్రశాంత్ పాకిస్తాన్ బోర్డర్ ని ఎలా దాటాడు

ప్రశాంత్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గూగుల్ మ్యాప్‌ను ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ప్రదేశం లోకి అడుగు పెట్టాను అని చెప్పాడు,ప్రశాంత్ చెప్పాడని పాక్ పోలీసు అధికారి షేక్ అస్జద్ అప్పుడు ఒక మీడియా సంస్థ చెప్పారు .అయితే ప్రశాంత్ సరిహద్దు నుంచి చాలా దూరం వచ్చేశారనీ, చొలిస్తాన్ ఎడారిలో తిరుగుతుండగా అరెస్టు చేశామని అస్జద్ తెలిపారు.

Categories
world

భారత్ ను ఐదు వేల లీటర్ల విషాన్ని కోరిన ఆస్ట్రేలియా…..

కరోనా బీభత్సంతో ప్రపంచం మొత్తం వణుకు పోతుంటే ఆస్ట్రేలియా మాత్రం ఎలకల దాడితో వణికిపోతుంది. అవును మన ఇళ్లల్లో కనిపించే సాధారణ ఎలుకలు ఇప్పుడు ఆస్ట్రేలియా వాసులకి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఒక్కొక్క ఇంట్లో పదులు కాదు, వందలు కాదు, ఏకం, లక్షల సంఖ్యలోని ఎలుకలు అక్కడ భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో కొన్ని రోజులుగా ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలపై, గ్రామాలపై దాడి చేస్తున్నాయి. పంట పొలాల మీద దాడి చేసి రైతులకి తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. రెస్టారెంట్లు, షాపుల వాళ్లంతా తమ తమ బిజినెస్ లు మూసేసి మరీ ఎలుకల్ని పట్టుకునే పనిలో పడ్డారు.దీంతో భారత్‌ నుంచి ఎలుకలను చంపే బ్రొమాడియోలోన్‌ను దిగుమతి చేసుకోవాలని ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది, ఈ ఎలుకల మందును గతంలో ఆస్ట్రేలియా నిషేధించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎలుకల దాడిని ఆపడానికి ఆ నిషేధిత మందే విరుగుడుగా భావిస్తోంది. అందుకే 5 వేల లీటర్ల బ్రొమాడియోలోన్‌ను భారత్‌ నుంచి దిగుమతి చేసుకోవాలి అనుకుంటుంది,భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్‌ విష పదార్థం అందగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతి తీసుకుని, ఎలుకల పని పట్టేందుకు సిద్ధమవుతోంది న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం..

Categories
general movies

షకీలా చేసే ఈ మంచి పనులు చూస్తే….

ప్రజలకు సహాయం చేయాలనుకుంటే ఏదో విధంగా ఎవరైనా చేయొచ్చు, అలాంటి పని చేస్తు ఆకలి బాధ తీరుస్తూన సినీనటి షకీలా.ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్‌ చేయిస్తున్నాడు,ఊపిరి పోస్తున్నాడు,మనిషిని బతికించడానికి చేతనైంత చేస్తూ దేవుడిగా మారాడు రీల్ విలన్.. రియల్ టైమ్ హీరో సోనూ సూద్, ఇప్పుడు అదే బాటలో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు నటి షకీలా. సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారిని అదుపు చేసేందుకు పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఉపాధి లేక ఎందరో నిరుపేదలు రోడ్డున పడుతున్నారు.లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తూ రోడ్ల పక్కన తిరగాడుతున్న నిరుపేదలకు అన్నం పెట్టి వారి కడుపు నింపుతున్నారీమె. దీనికి సంబంధించిన ఫొటోలను షకీలా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు, అందులో ఆమె పేర్కొంటూ రెండు చేతుల్లో ఒక చేతిని మీకోసం, మరో చేతిని ఇతరులకు సాయపడేందుకు ఉపయోగించండి.. పేదలకు చేతనైన సాయం చేయండి అంటూ పిలుపునిచ్చారు. ఈమె ఇప్పుడు కుక్ విత్ క్లౌన్ షో అనే ప్రోగ్రాం చేస్తున్నారు, షకీలా చేసే ఈ షో లక్షల మంది ఆదరిస్తున్నారు. షకీలా ఇలాంటి మంచి పనులు ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుంటున్నారు తన అభిమానులు.

Categories
general

రెండోసారి గోల్డ్ సంపాదించి పెట్టిన భారతదేశం ముద్దుబిడ్డ.

ఏషియన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ 2021 లో మహిళల విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, ఆరు కాంస్యాలు లభించాయి. ఆదివారం మహిళల విభాగంలో నాలుగు ఫైనల్స్‌లో పోటీపడ్డ భారత బాక్సర్లలో డిఫెండింగ్‌ చాంపియన్‌ పూజా రాణి ఉజబీకిస్తాన్ అమ్మాయి మీద 75kgs క్యాటగిరి లో విజయం సాధించింది,ఫైనల్లో పూజా రాణి .” టోక్యో ఒలింపిక్స్‌కు చెందిన రాణి ఆరంభం నుండే దాడి చేసింది మరియు మూడవ రౌండ్ ముగిసే సమయానికి ఆమె ప్రత్యర్థి పంచ్‌ల బ్యారేజీకి లోనవుతున్నాడు. ఆమె 5-0తో గెలిచింది. సెమీ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన మయాగ్‌మార్జర్‌గల్ ముంక్‌బాట్‌పై రాణికి వాక్ ఓవర్ లభించింది. అయితే పూజా రాణి ఈ పథకం తో పాటు ఆమెకు రూ.7.23 లక్షల(10వేల డాలర్లు)ను బహుమానంగా అందుకుంది.

” ఒకప్పుడు ప్రపంచ మాజీ ఛాంపియన్​ మేరీ కోమ్​ కూడా 51 కేజీల విభాగంలో రజత పతకాన్ని గెలుచుకుంది, ఈ ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని దక్కించుకుంది,ఆమె కంటే 11 ఏళ్ల వయసు చిన్నదైన నాజీమ్ కైజాయ్(కజకిస్థాన్​)పై 2-3 తేడాతో ఓటమిపాలైంది.”

Categories
general

ఏడు కోట్లు దొరికితే తిరిగి ఇచ్చేశారు, ఎవరు వీళ్ళు.

వీళ్ళ నిజాయితీకి నిజంగా హ్యాండ్స్ అప్ చెప్పాల్సిందే, ఎందుకంటే రోడ్డు మీద వెళుతున్నప్పుడు రూపాయి దొరికితేనే తిరిగి ఆలోచించకుండా జేబు లో పెట్టుకునే రోజులివి, అలాంటిది ఏకంగా ఏడు కోట్లు తిరిగి ఇచ్చేశారు ఈ నిజాయితీపరులు.

వివరాల్లోకి వెళితే:”మౌనిశ్‌ షా అనే భారత సంతతి వ్యక్తి మసాచుసెట్స్‌లో సొంతంగా ఓ స్టోర్‌ నడుపుతున్నాడు, అలాగే లాటరీ టికెట్లను కూడా అమ్ముతుంటారు, ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం మౌనిశ్‌ షా భార్య 1 మిలియన్‌ డాలర్‌ విలువ చేసే లాటరీ టికెట్‌ని లీస్‌ రోజ్‌ ఫిగా అనే మహిళకు అమ్మింది ఆమె, అదృష్టం కొద్ది ఆ టికెట్‌కే లాటరీ తగిలింది.” అయితేేేేేేే ఆ టికెట్ కొన్న లీస్‌ రోజ్‌ అల్ లాటరీ టికెట్ ని సరిగ్గా స్క్రాచ్ చేయకుండా తనకు లాటరీీీీీ తాగలేదు అనుకుని అ లాటరీ టికెట్ పక్కనేే ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. అయితే ఆరోజు సాయంత్రం షా కుమారుడు అభి షా దుష్టబిన్ లో ఉన్న టికెట్ తీసి సరిగ్గా చెక్ చేయగా ఆ టికెట్కిి 7 కోట్ల తగిలింది అని గమనించి ఆశ్చర్యానికి గురయ్యాడు, అయితేేేేేేేేేేేే ఈ వచ్చే్ డబ్బుతో టెస్లా కార్ కొందాముు అనుకుని తల్లిదండ్రులకు చెప్పగా వెంటనే దీనిిి గురించి “కానీ అతడి తల్లిదండ్రులు ఆ టికెట్‌ను దాన్ని కొన్న లీస్‌ రోజ్‌ ఫిగాకు అప్పగించాలని భావించారు. దీని గురించి అభి భారతదేశంలో నివసిస్తున్న తన తాతయ్య, నానమ్మలకు చెప్పగా వారు కూడా ఆ టికెట్‌ ఎవరిదో వారికి తిరిగి ఇచ్చేయమన్నారు. ‘‘దాన్ని మన దగ్గర ఉంచుకోవడం కరెక్ట్‌ కాదు. టికెట్‌ వారికి తిరిగి ఇచ్చేయండి,ఒకవేళ మీ అదృష్టంలో రాసిపెట్టి ఉంటే మీకే సొంతమవుతుంది’’ అన్నారు. దాంతో ఆ టికెట్‌ను లీస్‌ రోజ్‌ ఫిగాకు తిరిగి ఇచ్చేయాలని భావించాను’’ అన్నాడు అభి షా, తర్వావాత రోజు తల్లిదండ్రులు తీసుకుని లీస్‌ రోజ్‌ ఫిగా పని చేసేేే ప్రదేశానికి వెళ్లి ఆమెకు తను కొన్న టికెట్ తిరిగి ఇచ్చేశారు, మీరు కొన్ని దుష్టబిన్ లో పాడేసిన టిక్కెట్కు 7 కోట్లు లాటరీీీీ తగిలింది అని చెప్పగా ఆమె ఆనంద ఆశ్చర్యానికి లోనైంది, ఆమె అక్కడె కూర్చుని సంతోషంతో గట్టిగాా ఏడ్చేసింది , వారిని గట్టిగా కౌగిలించుకుని కృతజ్ఞతలుు చెప్పింద, మీలాంటివారుుు ఇంకాఈ లోకంలో ఉండడం తన అదృష్టమని మీకు ఈ జీవితాంత కాలం రుణపడి ఉంటానని పేర్కొంది.

Categories
crime

మొగుడి దగ్గర 60 లక్షలు బంగారం దొబ్బేసిన పెళ్ళాం.

ఒక ఇంట్లో భారీగా బంగారం చోరీ జరిగింది. అది తెలుసుకున్న ఇంట్లో మనిషి పోలీసులుకి కంప్లీట్ ఇవ్వగా, ఈ దొంగతనానికి తన భార్య అని షాకింగ్ న్యూస్ బయటపడింది, ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది, వివరాల్లోకి వెళితే..

శివ ప్రకాష్ అర్చనలకు 2008లో పెళ్లయింది, వీళ్లది ఖమ్మం జిల్లా కారేపల్లి. వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు ఉన్నారు, వీళ్లిద్దరి మధ్య తరచు గొడవ పడుతూ అది బాగా పెరిగి పెద్దదై అర్చన తన భర్త దూరంగా గుంటూరులో తల్లి దగ్గర ముగ్గురు పిల్లలతో నివాసం ఉంటుంది.ఈ సమయంలోనే కృష్ణ ప్రసాద్ అనే వ్యక్తికి దగ్గరై అతడితో వివాహేతర సంబంధానికి తెర తీసింది,ఇదిలా ఉంటే నెల రోజుల క్రిందట తన అత్త చనిపోయిన సమాచారం రాగా భర్త వద్దకు వెళ్ళింది అర్చన, అప్పుడే ఇంట్లో ఉన్నా వెండిని బంగారాన్ని గమనించిన అర్చన, వాటిని ఎలాగైనా చోరీ చేయాలని ప్లాన్ రచించింది, దానికోసం ప్రియుని సంప్రదించి అతని ఊరికి రప్పించి భర్త నిద్రపోతున్న సమయంలో అతడు దగ్గర ఉన్న లాకర్ తాళం తీసుకుని అందులో ఉన్న వెండి బంగారాన్ని ప్రియుడితో కలిసి దోచేసింది. కానీ ఇంట్లో చోరీ గమనించిన శివ ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితున్ని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది, ఈ చోరీ ప్లాన్ వేసింది తన భార్య అర్చన అన్న నిజం బయటకు వచ్చింది.

Categories
general world

ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మగ వ్యక్తి మృతి.

ప్రపంచం మొత్తం కరోనా వల్ల ఎంత అతలాకుతలం అయిపోయింది మనం చూశాం, ఎంతో మంది సైంటిస్టులు కష్టపడి చాలా షార్ట్ టైం లో వ్యాక్సిన్ కనిపెట్టారు, ఆ వ్యాక్సిన్ తొలిసారిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్‌పియర్‌ (81) మంగళవారం కన్నుమూశారు, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు బ్రిటిష్‌ మీడియా వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌ 8న ఆయన ఫైజర్‌ టీకా తీసుకున్నారు, ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్‌ కీనన్‌ కరోనా టీకా తీసుకున్నారు, ఆయనకు వేరే కొన్ని అనారోగ్యాల కారణంగా ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని బీబీసీ తెలిపింది.