తను ప్రాణంగా ప్రేమించిన భర్త కు ప్రాణం పోసింది ఆమె, తన కార్యాలయంలో సగభాగం ఇచ్చి భర్తను కాపాడుతుంది, ప్రేమ కథలు ఎన్నో రకాలుగా ఉంటాయి అందులో వీళ్లది ఒక ప్రేమ కథ, వేరే వేరే మతాలు అయినా పెద్దలను ఎదిరించి 21 సంవత్సరాల క్రితమే వీరు పెళ్లి చేసుకున్నారు, ఈ ప్రేమికులు పొద్దుటూరు కు చెందిన సుబ్బారెడ్డి ముంతాజ్.
కొంతకాలం గడిచేటప్పటికి సుబ్బారెడ్డి బంధువులు దూరం పెట్టిన ముంతాజ్ తల్లిదండ్రులు మాత్రం ఈ ప్రేమ జంట కు అండగా ఉన్నారు, ఈ దంపతులకు ఒక కూతురు ఒక కొడుకు పుట్టారు, అయితే కొన్ని రోజుల క్రితం నుంచి సుబ్బారెడ్డి కాలేయం సమస్య తో బాధపడుతున్నాడు, అయితే హైదరాబాద్ హాస్పిటల్లో చూపించక లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నట్లు గమనించారు, అప్పటికే లివర్ బాగా దెబ్బతినడంతో కాలేయ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు, అయితే దాతల కోసం ప్రయత్నించగా ఆ ప్రయత్నం ఫలించకపోవడంతో భార్య ముంతాజ్ తన లవర్ ని ఇవ్వటానికి ముందుకు వచ్చింది, డాక్టర్లు టెస్టులు చేసి భార్య ముంతాజ్ కాలేయం సరిపోతుందని అని తేలడంతో డాక్టర్లు కాలేయ మార్పిడి శాస్త్ర చికిత్స చేశారు,ప్రస్తుతం సుబ్బారెడ్డి ఆరోగ్యంగా ఉన్నాడు, ముంతాజ్ ఆరోగ్యం కూడా కోలుకుంటోంది.
