పప్పు కోసం గొడవ మనిషి ప్రాణం పోయేలా చేసింది. దీనికి సంబంధించిన వివరాలను విజయనగరం పోలీసులు వెల్లడించారు. వంట మనిషిగా పనిచేస్తున్న ఆర్.శ్రీనుకు, రూపావతికి 22 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో ఒకరికి వివాహమైంది. వీరు విజయనగరంలోని లంకవీధిలోని పూరిగుడిసెలో ఉంటున్నారు, శ్రీను రోజులాగే ఆరోజు తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు ,శనివారం భార్య వంకాయ కూర ఉండి భర్తకు భోజనం పెట్టింది, భర్త మాత్రం ఆ కూర వద్దని పప్పు వండమని చెప్పాను కదా అన్నాడు సరే పప్పు చేస్తానని ఆమె వంట గదిలోకి వెళ్లి వంట మొదలు పెట్టింది .ఇంతలో ఆమె వెనకాలే వెళ్లి శ్రీను గొడవ పడి కిందపడ్డాడు, అక్కడే కూరగాయలు కోసే కత్తి వీపునకు గుచ్చుకుని రక్తం పోయింది,వెంటనే కేంద్రాసుపత్రికి చికిత్సకు తీసుకుని వెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు సంఘటన స్థలాన్ని సీఐ లక్ష్మణరావు, ఎస్ఐ బాలాజీరావు పరిశీలించారు. కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు.
