Categories
crime

భార్యను తానే చంపానని ఒప్పుకున్నాడు…కానీ మృతదేహం 1600 సంవత్సరాల క్రితంది

ఈ సంఘటన ఇంగ్లాండ్ లో జరిగింది ఇప్పుడు ఇది సెన్సేషన్ గా మారింది ఓ మర్డర్ కేస్ విచారణలో మతిపోయే విషయాలు బయటపడ్డాయి, ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఇప్పటిది కాదు చాలా పురాతనమైనది, పురాతనమైనది అంటే 1600 సంవత్సరాల క్రితం ది,ఈ సంఘటన ఇప్పటిది కాదు 1959 లో జరిగింది, ఆమె పేరు మలైకా డీ ఫెర్నాండెజ్ చిత్రాలు గీసే ఆర్టిస్ట్ పైగా ట్రావెలర్ ఈ క్రమంలో ఓ సారి జర్నీలో ఆమెకు పీటర్ రెన్ బార్డ్ అనే ఎయిర్ లైన్ ఉద్యోగి పరిచయం అయ్యాడు.అ పరిచయం ప్రేమగా మారింది తనను పెళ్లి చేసుకోవాలని పీటర్ మలైకా ఓకే చెప్పడంతో నాలుగు రోజుల్లో వివాహం అయిపోయింది.

పెళ్లి చేసుకునే నాలుగు నెలలు తర్వాత పెళ్లి విడాకులు అయింది, ఆ తర్వాత ఎవరి పని వారు చూసుకున్నారు, మలైకా ఎప్పుడు లాగే ప్రపంచ పర్యటన మొదలు పెట్టింది పీటర్ తన కాటేజ్ లోనే ఉండు సాగాడు, ఇది జరిగిన రెండు సంవత్సరాలు తర్వాత మలైకా అదృశ్యమయింది మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముందుగా మాజీ భర్త పీటర్ ని అనుమానించారు,  పీటర్ ఇంట్లో సోదాలు చేయగా మలైకా కి సంబంధించిన ఏ ఆధారం దొరకలేదు, అలా ఆ కేసు 20 సంవత్సరాలు పాటు మిస్టరీగానే మారిపోయింది,ఈ క్రమంలో పీటర్ కాటేజీకి సమీపంలోని నేలలో(పీట్ బాగ్) శరీర భాగాలు దొరికాయి. దీంతో మళ్లీ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు ,పీటర్ ని అదుపులోకి తీసుకుని విచారించాగా. తానే మలైకాని మర్డర్ చేసినట్లు విచారణలో పీటర్ అంగీకరిచాడు. పీట్ బాగ్ నేలను సేంద్రీయ పదార్ధం, నాచుతో చేస్తారు,ఈ తరహా నేలలో యాసిడ్ ఉంటుంది. మృతదేహాల పడుఅవకుండా బాగా ఉపయోగపడుతుంది,ఆ నేల నుంచి పోలీసులు ఓ మహిళ తల సేకరించారు. అది మలైకాదే అని భావించాగా ఆ తలబాగని ల్యాబ్ కి పంపి టెస్టులు నిర్వహించారు. టెస్టులో వారికి షాకింగ్ మతి పోయే విషయం తెలిసింది. ఆ మృతదేహం ఇప్పటిది కాదు అని1600 ఏళ్ల క్రితమే ఆ వ్యక్తి చనిపోయినట్లు తెలుసుకున్నారు,1600ఏళ్లు దాటినా ఇంకా ఆ పుర్రె పాడవకుండా ఉండటం అందరిని ఆశ్యర్యానికి గురి చేసింది.

ఆ పుర్రె తన మాజీ భార్యది కాదనే విషయం తెలియగానే.. పీటర్ రివర్స్ డ్రామా ఆడాడు , తాను ఆమెని హత్య చేయలేదని చెప్పాడు. కానీ పోలీసుల ముందు అతడి ఆటలు సాగలేదు. మలైకాను తానే గొడ్డలితో నరికి చంపినట్టు ఒప్పుకున్నాడు ,విడిపోయిన తర్వాత మలైకి రోజూ తన రూమ్కి వచ్చేదని తాను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే నేను గే అనే విషయాన్ని బయటపెడతానని నను బెదిరించేది అని చెప్పాడు. ఇంగ్లండ్ లో గే అనేది చట్టరిత్యా నేరం. దీంతో విసిగిపోయిన తాను ఆమెని హత్య చేశానని ఒపుకునాడు.మొతానికి ఆ తల ఓ మహిళదే కానీ, ఇప్పటిది కాదు. 1600 ఏళ్ల క్రితమే చనిపోయింది దీనిపై ల్యాబ్ లో పరిశోధనలు జరపగా ఆ పుర్రె రోమన్ సమయానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు పరిసోదుకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *