Categories
general

Covid-19 వ్యతిరేకంగా పోరాడడానకి క్రికెట్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ భారీ విరాళాన్ని ప్రకటించారు.

భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ సచిన్ టెండూల్కర్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సాంద్రతలను(concentrate) సేకరించడానికి మరియు అందించడానికి రూ .1 కోట్లు విరాళంగా ఇచ్చారు.సచిన్ ఒక ట్వీట్ చేసి, దేశం కోసం ఆడుతున్నప్పుడు తనకు లభించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. టెండూల్కర్ ఒక ట్వీట్ చేసి, COVID-19 యొక్క రెండవ వేవ్ మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెట్టిన తీవ్ర ఒత్తిడి గురించి మాట్లాడారు. ఎంతో అవసరం ఉన్న పెద్ద సంఖ్యలో తీవ్రమైన రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నట్లు చెప్పారు.

ట్విట్టర్లో, టెండూల్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు, “COVID యొక్క రెండవ వేవ్ మన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. తీవ్రమైన COVID రోగులకు అధిక సంఖ్యలో ఆక్సిజన్ ఎంతో అవసరం. ఈ సందర్భంగా ప్రజలు స్వచందంగా సాయం చేయడం చూడటం హృదయపూర్వకంగా ఉంది. 250+ యువ పారిశ్రామికవేత్తల బృందం ఆక్సిజన్ సాంద్రతలను(concentraters) దిగుమతి చేసుకోవటానికి మరియు దేశవ్యాప్తంగా ఆసుపత్రులకు విరాళంగా ఇవ్వడానికి నిధులు సేకరించడానికి మిషన్ ఆక్సిజన్‌ను ప్రారంభించింది. ” అతని గమనిక మరింత చదువుతుంది: "నేను దీనికి సహకరించడం ద్వారా సహాయం చేసాను మరియు వారి ప్రయత్నం త్వరలో భారతదేశం అంతటా మరెన్నో ఆసుపత్రులకు చేరుకుంటుందని ఆశిస్తున్నాను." సచిన్ ఇలా ముగించారు, “నేను ఆడుతున్నప్పుడు మీ మద్దతు అమూల్యమైనది మరియు విజయవంతం కావడానికి నాకు సహాయపడింది. ఈ రోజు, దీనిపై పోరాడటానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరి వెనుక మనం కలిసి నిలబడలి అయిన తన ట్విట్టర్ లో పెరుకునారు.
379,257 కొత్త అంటువ్యాధులు మరియు 3,645 కొత్త మరణాలు సంభవించినందున గురువారం భారతదేశం యొక్క మొత్తం కేసులు 18 మిలియన్లు దాటాయి - మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి ఒకే రోజులో అత్యధిక మరణాలు సంభవించాయి.

Categories
general movies

కొరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో వివిధ రూపంలో సహాయం చేస్తున్న బాలీవుడ్ స్టార్స్.

బాలీవుడ్ స్టార్లు అందరూ కోవిడ్ మీద  ఫైట్ చేస్తున్నారు, అక్షయ్ కుమార్ 100 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ కొరోనా పేషెంట్స్ కోసం తన వంతు సాయంగా ఉచితంగా ఇచ్చారు, అలాగే బాలీవుడ్ మరో స్టార్ అజయ్ దేవ్ గన్ కోవిడ్ సంబంధించిన ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ కిట్స్ ని డొనేట్ చేశారు,అలాగే ఆయుష్మాన్ అనే యాక్టర్ మహారాష్ట్ర రిలీఫ్ ఫండ్ కి అమౌంట్ డొనేట్ చేశారు, అలాగే సోనుసూద్ ఈయన పేరు అసలు చెప్పనవసరం లేదు ఏదైనా కష్టం అంటే నేనున్నాను అంటారు, మనకి కరోనా ఫస్ట్ వేవ్ లో ఆయన చేసిన సహాయాని మాటల్లో చెప్పాలంటే కష్టమే, కొంతమంది వలస కూలీలు దేవుడు ఫోటో పక్కన ఆయన ఫోటో పెట్టుకున్నారు అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది,ఇప్పుడు free  కోవిడ్ helpline స్టార్ట్ చేశారు, అలాగే ఆన్లైన్లో ఉచిత డాక్టర్ కన్సల్టెన్సీ కూడా మొదలుపెట్టారు,ఇలా బాలీవుడ్ ప్రముఖులు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది చూసి మరి కొంతమంది ముందుకొచ్చి covid- 19 బాధితులకు వాళ్ల సహాయ సహకారాలు అందించాలని ఆశిస్తున్నాం.

Categories
general

మారుతి సుజుకి కొరోనా పేషెంట్స కోసం తన ప్లాంట్లు షర్ట్ డౌన్ చేయబోతుందా…..

భారతదేశంలో సెకండ్ వేవ్ కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నందున, వైద్య అవసరాలకు ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి బుధవారం దేశంలోని తయారీ సదుపాయాల నుండి జూన్ 1 నుండి మే 1 వరకు మనుఫక్టురింగ్ ఉనిట్లును మూసివేస్తున్నట్లు చెప్పారు.

హర్యానాలో కంపెనీ తయారీ సౌకర్యాలు, అలాగే సుజుకి మోటార్ గుజరాత్ (SMG) రెండూ మే 9, 2021 వరకు మూసివేయబడతాయి.
మారుతి సుజుకి మాట్లాడుతూ, మిము ఆక్సిజన్ తకువ ఉపయోగిమ్చినపటికీ , అయితే ఇది ఎంతో మంది కోవిడ్ కేసులుకు ఉపయోగపడుతుంది అన్నది,ఈ సమయంలో దేశం కోవిడ్ కేసుల పెరుగుదలతో పోరాడుతున్నప్పుడు, ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న అన్ని ఆక్సిజన్‌ను ఉపయోగించుకోవాలి.
కార్ల తయారీ ప్రక్రియలో భాగంగా, మారుతి సుజుకి తన కర్మాగారాల్లో తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ను ఉపయోగిస్తుండగా, చాలా పెద్ద పరిమాణాలను భాగాల తయారీదారులు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థతిలో ప్రాణాలను కాపాడటానికి అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ను ఉపయోగించాలని మేము నమ్ముతున్నాము ”అని మారుతి సుజుకి బోర్స్‌లకు ఒక ప్రకటనలో తెలిపారు. దానికి అనుగుణంగా, మారుతి సుజుకి దాని నిర్వహణ షట్‌డౌన్‌ను మొదట జూన్‌లో షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది, మొదట జూన్ 1 నుండి 9 వరకు మే. ఈ కాలంలో నిర్వహణ కోసం అన్ని కర్మాగారాల్లో ఉత్పత్తి మూసివేయబడుతుంది. తన కర్మాగారం కోసం సుజుకి మోటార్ గుజరాత్ ఇదే నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీకి సమాచారం అందింది.
Categories
general

తోటి కరోనా పేషెంట్ కి తన బెడ్ ఇచ్చి తాను ప్రాణత్యాగం చేసిన పెద్దాయన,ఈయన త్యాగానికి యావత్ ప్రపంచం సెల్యూట్ చేయవలసిందే…

నాగ్‌పూర్: ఒక భార్య తన భర్త కోసం ఆసుపత్రిలో మంచం కోసం వెతుకుతూన సమయములో తన మంచం ఇచిన అయిన మూడు రోజుల తరువాత ప్రపంచానికి వీడ్కోలు చెప్పారు.
కరోనావైరస్ యొక్క సెకండ్ వేవ్ లో, భారతదేశంలోని అనేక నగరాల్లోబెడ్లు ఆక్సిజన్ కొరత ఉంది. ఇంతలో నాగుపర్ (నాగ్పూర్) కు చెందిన 85 ఏళ్ల పెద్దవాడు తాను ఉన బెడ్ ను సమర్పించాడు, ఈ త్యాగానికి ఆయనను చాలా మంది ప్రశంసించారు. నారాయణ్ భరవు దభద్కర్ కరోనా బారిన పడి అయిన ఆసుపత్రిలో తన బెడ్ పై చికిస్తా పొందుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక మహిళ తన భర్త ప్రాణాలను కాపాడటానికి మంచం కోసం వెతుకుతోంది ఇది గమనించిన అయిన తన మంచం ఇచ్చి,నాకు 85 సంవత్సరాలు జీవితాన్ని చూశాను, కానీ ఆ మహిళ భర్త చనిపోతే పిల్లలు అనాథ అవుతారు, కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాన్ని కాపాడటం నా కర్తవ్యం’ అని అన్నారు.
ఆసుపత్రి నుండి తిరిగి వచ్చిన మూడు రోజుల తరువాత మరణించారు నారాయణ్ దభద్కర్,కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అతని ఆక్సిజన్ స్థాయి 60 కి చేరుకుంది. కుమార్తె మరియు అల్లుడు ఆమెను ఇందిరా గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చాలా ప్రయత్నం తరువాత, అతనికి ఒక మంచం వచ్చింది. అప్పుడు ఆ మహిళ తన 40 ఏళ్ల భర్తను కాపాడటానికి మంచం కోసం వెతుకుతోంది. పడకలు ఖాళీగా లేనందున అతన్ని నియమించడానికి హాస్పిటల్ వారు నిరాకరించారు,ఏడుస్తున్న స్త్రీని చూసి ఆయినకు గుండే చాలించి ఆమెకు తన మంచం ఇచారు.

ఆసుపత్రి పరిపాలన సిబందికి ఒక లేఖ రాసారు. అందులో ‘నేను మరొక రోగి కోసం స్వచ్ఛందంగా నా మంచం ఖాళీ చేస్తున్నాను.’ అని రాసి అయిన ఇంటికి తిరిగి వచ్చి మూడు రోజుల తరువాత మరణించారు.
Categories
general

ఒకే ఒక ఫ్యామిలీ కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 80 వేల కోట్లు పన్ను కట్ట బోతుంది…

కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 80 వేల కోట్లు పన్నులను కడుతుంది ఒక ఫ్యామిలీ, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న నిజమే,ప్రపంచంలోనే అత్యధిక పన్నులు కడుతున్న వారసత్వ కుటుంబం,వారెవరో కాదు సాంసంగ్ సంస్థ అధిపతులు,సంస్థ మాజీ చైర్మన్ లీ కున్ హి చనిపోవడంతో ఆయన సంపద లో సగ భాగం వారసత్వం పన్నులో భాగంగా ఏకంగా 80 వేల కోట్లు రూపాయలు చెల్లించాలని సాంసంగ్ ఈరోజు ప్రకటించింది,రాబోయే ఐదేళ్లలో మొత్తం ఆరు విడతలుగా ఆ మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించిన లీ కుటుంబం.. ఈ నెలలోనే తొలి చెల్లింపు చేసింది,చెల్లింపుల్లో భాగంగా లీ కూడబెట్టిన 23 వేల కళాఖండాలను ప్రభుత్వానికి అందించనుంది అని తెలుస్తుంది తద్వారా పన్ను కోసం డబ్బు చెల్లింపులను తగ్గించుకోవాలని చూస్తోంది,ఆ దేశంలో గతేడాది వసూలైన ఎస్టేట్ పన్నుల ఆదాయంకన్నా శాంసంగ్ కట్టనున్న వారసత్వ పన్నులు మూడు రెట్లు ఎక్కువ.

Categories
crime

చీటింగ్ కేసులో యాంకర్ శ్యామల భర్త అరెస్ట్.

యాంకర్ శ్యామల భర్తను హైదరాబాదులోని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు,మహిళ నుంచి కోటి రూపాయలు అప్పుగా తీసుకుని తప్పించుకుని తిరుగుతున్న యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు.తన వద్ద కోటి రూపాయలు తీసుకుని ఇవ్వడం లేనది ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది,2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారిగా డబ్బు తీసుకునట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. డబ్బుల విషయం అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా తెలిపింది. డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది,కాగా ఇదే విషయంపై సెటిల్ మెంట్ చేసుకోవాలంటూ ఈ కేసులో నర్సింహారెడ్డి తరపున మరో మహిళ రాయబారం నడిపినట్లుగా తెలిపింది,ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసుల నర్సింహారెడ్డి తో పాటు రాయబారం నడిపిన మహిళను రిమాండ్ కి తరలించారు వాటిని తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. 

Categories
general movies

సల్మాన్ ఖాన్ ఈ చిత్రంలో ఏం తింటున్నాడు ఎందుకు తింటున్నాడో చూస్తే మీరు నిజంగా హ్యాట్సాఫ్ చెప్తారు.

కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో మనం గమనిస్తున్నాం, ఇప్పుడు భారతదేశంలో పరిస్థితులు చెయ్యి జారి పోయినట్లే కనిపిస్తున్నాయి, రోజుకు కొన్ని లక్షల మంది కరోనా బాధితుల చూస్తున్నాం, అందులోనూ వ్యాక్సిన్ కొరత ఆక్సిజను కొరత తో చాలా ఇబ్బందులు పడుతున్నాం , ఈ సమయంలో కొంతమంది దాతలు వివిధ రూపంలో వారికి తోచిన విధంగా సహాయం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు, అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తనకు తోచిన రీతిలో సహాయం చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ 5000 మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫుడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసే క్రమంలో ఫుడ్ క్వాలిటీని రుచి చూసే చిత్రం మీరు చూస్తున్నారు, సల్మాన్ ఖాన్ ఫుడ్ టెస్టింగ్ చూసి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్మాన్ ఖాన్ హ్యూమన్  ఫౌండేషన్ ద్వారా రోజు ఐదువేల మందికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఫుడ్ పంపిణీ చేస్తున్నారు అందులో పోలీస్ వారు మెడికల్ స్టాప్ అండ్ బిఎంసి ఎంప్లాయిస్ కూడా ఉన్నారు, ఈ ఆహార పంపిణీ మూడు వారాల నుంచి జరుగుతుంది, దాంతోపాటు టి, మినరల్ వాటర్, బిస్కెట్స్ స్నాక్స్ కూడా పంచి పెడుతున్నారు, గత ఏడాది ఇదే సమయంలో లాక్ డౌన్ లో తన ఫాంహౌస్ చుట్టూ ఉన్న విలేజ్లో వారికి ఇలాగే ఆహారం ఉచితంగా పంపిణీ చేశారు, సల్మాన్ ఖాన్ చేసే ఈ సహాయానికి ప్రజలు అలాగే ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు, ఇది చూసి ప్రముఖులు వ్యాపారస్తులు సెలబ్రిటీస్ కూడా వారికి తోచిన రూపంలో సహాయం చేయాలని ఆశిస్తున్నాం.

Categories
general

కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాత సోనుసూద్ బొంబాయి ఎయిర్ పోర్ట్ లో……..

కోవిడ్ -19 నుండి కోలుకున్న తర్వాత నటుడు సోను సూద్ బొంబాయి నుండి బయలుదేరినట్లు కనిపించింది నటుడు నీలిరంగు జీన్స్ మరియు పింక్ చొక్కా ధరించి సన్ గ్లాస్సెస్ పెటుకున దృశ్యాలు చూడవచ్చు.
లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలక కార్మికులకు అండగా నిచారు సోనూ సూద్. సొంతూళ్లకు వెళ్లే కార్మికులకు ప్రత్యేక బస్సులు, రైళ్లు, ప్లైట్లు బుక్ చేసి మరీ వారిని ఇళ్లకు పంపించారు. అప్పటి నుంచి కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు,ఇటీవల అదే కరోనా మహమ్మారి బారిన పడ్డారు సోనూసూద్. ఈ రియల్ హీరో.. తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. సోనూ కరోనా బారిన పడినప్పటి నుంచి ఆయన కోలుకోవాలని అభిమానులు దేవుళ్ళను ప్రార్థించగా తాజాగా ఆయనకు నెగిటివ్ రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
కరోనా సెకండ్ వేవ్,రెండో దశలో ఎవరు ఉహహించిన పరస్తితిలో కరోనాకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండగా, ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఎంతో మంది కరోనా రోగులకు సరైన చికిత్స లభించక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సోనూసూద్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.భారతి అనే మహిళ కరోనాతో బాధపడుతుండగా, ఆమె పరిస్థితి విషమించింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను నాగ్ పూర్ నుంచి హైదరాబాదుకు ఎయిర్ అంబులెన్స్ ద్వారా వాయుమార్గంలో తరలించారు. అందుకైన ఖర్చును సోనూ సూద్ భరించారు.
Categories
general

సబ్బం హరికి కరోనా పాజిటివ్, పరిస్థితి విషమంగానే ఉంది…

మాజీ మేయర్, అనకాపల్లి మాజీ ఎంపీ, సీనియర్‌ రాజికియ నాయకుడు సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన సబ్బం హరి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు,మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు.

ఈ నెల 15వ తేదీన కరోనా పాజిటివ్‌ నివేదిక రాగా, వైద్యుల సూచన మేరకు మూడు రోజులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. అయితే, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, సబ్బం హరికి కోవిడ్‌తో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

Categories
general

కరోనా పాజిటివ్ వచ్చిందేమో అని ఆగిన గుండె,తీరా చూస్తే నెగిటివ్ వచ్చింది.

ఎప్పుడు ఎల ఎవరు జీవి విడుస్తారో ఎవరికి తెలియదు, అది ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత మరి భయంకరంగా పరిస్థితులు మారాయి. ప్రపంచ రికార్డ్స్ బద్దలు కొట్టే దిశగా మన కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి,  దానికి కారణం మానవ నిర్లక్ష్యం ఒక కారణం, ఏ టీవీ చూసిన ఈ ఏ  సోషల్ మీడియా లో చూసిన కరోనా  కేసులు వాళ్ల డెడ్ బాడీస్ చూసి ఒక్రికి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, మరి ఏ జ్వరం వచ్చిన వారి పరిస్థితి అయితే అసలు చెప్పక్కరలేదు, అలాగే ఒక వ్యక్తి జ్వరం వచ్చింది అని కరోనా test కోసం వచ్చి పాజిటివ్ వస్తుందేమో అని గుండెపోటుతో ప్రాణం విడిచాడు,  నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలానికి చెందిన అశోక్ తీవ్ర జ్వరం రావడంతో తల్లితో కలిసి కరోనా  టెస్ట్ కి వచ్చాడు,  అనంతరం టెస్ట్ ఫలితం కోసం ఎదురు చూస్తూ ఓ చెట్టుకింద కూర్చుని అక్కడే ప్రాణాలు విడిచాడు, రిసల్ట్ నెగిటివ్ రాగా అశోక్ గుండెపోటుతో మరణించాడని వైద్యులు తెలిపారు, క కళ్ళ ముందే కొడుకు చనిపోవడంతో తల్లి రోదనలు మిన్నంటాయి.