movies

ఫస్ట్ డే  కలెక్షన్స్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టిన వకీల్ సాబ్.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కాగా, ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. తొలిరోజు ఈ సినిమాను చూసేందుకు జనం పెద్ద ఎత్తున థియేటర్లకు క్యూ కట్టారు ఎక్కడ చూసినా హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈ జోరంతా చూసిన తర్వాత తొలిరోజు ఆల్ టైమ్ రికార్డులను పవన్ సెట్ చేసాడు అని పండగ చేసుకున్నారు అభిమానులు.

అయితే ఫస్ట్ డే అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కలెక్షన్స్ బయటికి రాలేదు. కానీ అధికారికంగా చెప్పకపోయినా వకీల్ సాబ్ తొలిరోజు 40 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది.పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా విడుదలైనపుడు అంతా అడిగే ప్రశ్న ఒక్కటే.. సినిమా ఎలా ఉంది.. మొదటి రోజు ఎంత వసూలు చేసింది..? పాత రికార్డులు బద్ధలయ్యాయా లేదా అని మాత్రమే ఆరా తీస్తుంటారు. ఎందుకంటే పాత రికార్డులతో చెడుగుడు ఆడుకోవడం పవర్ స్టార్‌కు ముందు నుంచి ఉన్న అలవాటు.. ఇక బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ మేనియా మామూలుగా లేకపోవడంతో ఈ సినిమా తొలిరోజు అదిరిపోయే కలెక్షన్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.ఓవర్సీస్‌లో వకీల్ సాబ్ ప్రభంజనం భారీగా కనిపించింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.5.5 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.