Categories
general world

ప్రపంచంలో మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మగ వ్యక్తి మృతి.

ప్రపంచం మొత్తం కరోనా వల్ల ఎంత అతలాకుతలం అయిపోయింది మనం చూశాం, ఎంతో మంది సైంటిస్టులు కష్టపడి చాలా షార్ట్ టైం లో వ్యాక్సిన్ కనిపెట్టారు, ఆ వ్యాక్సిన్ తొలిసారిగా కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న పురుషుడిగా రికార్డు నెలకొల్పిన బ్రిటన్‌కు చెందిన విలియం షేక్స్‌పియర్‌ (81) మంగళవారం కన్నుమూశారు, వ్యాక్సిన్‌తో సంబంధంలేని అనారోగ్య సమస్యలతో ఆయన మృతిచెందినట్టు బ్రిటిష్‌ మీడియా వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌ 8న ఆయన ఫైజర్‌ టీకా తీసుకున్నారు, ఆయన కంటే ముందు 91 ఏండ్ల మహిళ మార్గరేట్‌ కీనన్‌ కరోనా టీకా తీసుకున్నారు, ఆయనకు వేరే కొన్ని అనారోగ్యాల కారణంగా ఆస్పత్రిలో చేరిన షేక్‌స్పియర్‌ ఈనెల 20న కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని బీబీసీ తెలిపింది.   

Categories
crime general

ఒకే రోజు 12 మందికి ఉరిశిక్ష వేస్తూ తీర్పు ఇచ్చిన కోర్ట్

హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 12 మందికి ఉరిశిక్ష విధించింది.”2008లో లారీ డ్రైవర్లు, క్లీనర్లను దారుణంగా హతమార్చి వాగు వద్ద హైవే కిల్లర్‌ మున్నా గ్యాంగ్‌ పూడ్చి పెట్టిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి 4 కేసుల్లో 18 మందిపై నేరం రుజువైంది, పశ్చిమ బెంగాల్‌ దుర్గాపూర్‌ నుంచి ఇనుప రాడ్ల లోడ్‌తో తమిళనాడులోని కల్పకంకు బయలుదేరిన లారీతోపాటు డ్రైవర్, క్లీనర్‌ అదృశ్యమయ్యారు”.దీంతో 2008 అక్టోబర్‌ 17న లారీ యజమాని వీరప్పన్‌ కుప్పుస్వామి ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు,పోలీసులు పాత ఇనుము వ్యాపారులపై నిఘా పెట్టారు,సయ్యద్‌ అబ్దుల్‌ సమద్‌ అలియాస్‌ మున్నా కోసం గాలింపు చేపట్టారు,దాదాపు 20కి పైగా సిమ్‌ కార్డులు మార్చి దేశం వదిలి పారిపోయేందుకు యత్నించిన మున్నాను కర్ణాటకలోని అరెస్ట్ చేశారు,ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిల్లర్ మున్నాను అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో సంబంధం ఉన్న 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అనేక సంవత్సరాలు ఈ కేసును విచారించిన ఒంగోలు కోర్టు ఈరోజు కీలక తీర్పును వెలువరించింది.  కిల్లర్ మున్నా గ్యాంగ్ 12 మందికి ఉరిశిక్ష విధిస్తు తీర్పు ఇచ్చింది.  

Categories
general

ఈ బుడ్డోడు ఏమిటి, వీడు చేసే పనులు ఏమిటి….

అమ్మ బాబోయ్ ఈ పిల్లోడు ఏమిటి ఇలా తినేస్తున్నాడు, మనం కాకరకాయ తినాలి అనుకుంటే చాలా ఆలోచిస్తుంటాం, పెద్దలు అప్పుడప్పుడు వ్యాప పుల్ల తో బ్రష్ చేయమంటే నే అయ్య బాబోయ్ అంటుంటాం కానీ ఈ బుడతడు చేదుగా ఉన్న వ్యాపాఆకులు చాక్లెట్స్ తిన్నట్లు తినేస్తున్నాడు, ఆరు నెలల నుండి ఈ బాబు వేపాకులు తింటున్నాడు అని తల్లిదండ్రులు చెప్తున్నారు,”రాయణపేట ఊట్కూరుకు చెందిన సూరం ప్రకాశ్ ఉమాదేవి దంపతులకు కుమారుడు తనిష్క్ అనే 15 నెలల బాలుడు ఉన్నాడు,తండ్రి ఉదయం వేప కొమ్మతో పళ్లు తోముకుంటూ దానికి ఉన్న ఆకుల్ని కాయలను బుడ్డోడి ముందు పెట్టేవారు వాడు ఆడుతూ, పాడుతూ వాటిని తినడం అలవాటు చేసుకున్నాడు, ఇలా రోజూ వేపాకు తింటే ఏమైనా అలెర్జీలు వస్తాయేమో అని తల్లిదండ్రులు భయపడ్డారు, ఈ చిన్నోడు అలవాటును నారాయణ పేటలోని డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి, రోజు ఇలా వేపాకులు తింటే యాంటిబాడీస్ పెరుగుతాయని చెప్పారు.

Categories
general

నోటికొచ్చింది వాగడం తర్వాత వెనక్కి తీసుకున్నానని అనడం

ఈ మధ్యన ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, నోటికొచ్చింది వాగడం తర్వాత చింతిస్తున్నాను అని వెనక్కి తీసుకోవడం, అది సాధారణ వ్యక్తుల, రాజకీయ నాయకులు, స్వామీలు అందరూ ఇది తంతు. ఆ పని ఇప్పుడు రాందేవ్ బాబా చేశాడు,అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు బాబా రామ్ దేవ్ ప్రకటించారు. అంతేకాకుండా ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు,పతంజలి యోగా సంస్థ దీనిపై వివరణ ఇస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను ఎడిట్ చేశారని, ఆధునిక సైన్స్ మీద ఆయనకు ఎంతో గౌరవం, విశ్వాసం ఉన్నాయని పేర్కొంది, వీటిపై ఆయనకు ఎటువంటి చెడు అభిప్రాయం లేదని సైన్స్ మీద ఎంతో గౌరవం ఉందని తెలిపారు, ఒక ఈవెంట్ లో తనకు వాట్సాప్ ద్వారా వచ్చిన సందేశం మాత్రమే చదివారని, ఆయనకు ఆటువంటి అభిప్రాయం లేదని వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించింది, ( “అల్లోపతి ఒక కుంటి శాస్త్రం అని మొదట, హైడ్రాక్సీక్లోరోక్విన్ విఫలమైంది అని, ఇప్పుడు రెమ్‌డెసివిర్, ఐవర్‌మెక్టిన్, ప్లాస్మా థెరపీ విఫలమయ్యాయి,ఫాబిఫ్లు, స్టెరాయిడ్లతో సహా ఇతర యాంటీబయాటిక్స్ కూడా విఫలమయ్యాయి అని బాబా రామ్‌దేవ్ ఆరోపించారు, ఆక్సిజన్ కొరత కంటే అల్లోపతి మందుల వల్ల లక్షలాది మంది COVID-19 రోగులు మరణించారని ఘాటు వ్యాఖ్యలు చేశారు) అయితే బాబా చేసిన కామెంట్లు పై పెద్ద రగడ జరుగుతుంది, అల్లోపతి పై ఆయన చేసిన విమర్శలు డాక్టర్లను, వైద్య సిబ్బందిని అవమానపరుస్తున్నారని, కించ పరుస్తున్నారని అనేకమంది ఆయనను తీవ్రంగా విమర్శించారు,ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లీగల్ నోటీసు పంపారు అని తెలుస్తుంది, ఇలా కొన్ని విధాల సంస్థల నోటీసులు రావడంతో రాందేవ్ బాబా అల్లోపతిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు యోగాగురు తెలిపారు,అంతేకాకుండా ఎవరి మనసులనైనా కష్టపడితే క్షమించాలని కోరారు. ముందు ఏది పడితే అది మాట్లాడడం ఎందుకు తర్వాత క్షమించండి చింతిస్తున్నాము అనడం ఎందుకు.

Categories
general

Mig-21 విమానం కూలి భారతమాత ముద్దుబిడ్డ అభినవ్ చౌదరిని కోల్పోయాం.

Mig-21 యుద్ధ విమానం వాతావరణం అనుకూలించక సాంకేతిక లోపంతో గురువారం రాత్రి కూలిపోయింది, ఈ ప్రమాదంలో IAF పైలెట్ అభినవ్ చౌదరి మరణించారు, ఈ ప్రమాదం పంజాబ్ రాష్ట్రం మొగ డిస్టిక్ట్ లో జరిగింది. ఎప్పటిలాగే శిక్షణా కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ నుంచి పంజాబ్‌లోని హల్వారాకు యుద్ధ విమానం నడిపారు అభినవ్ చౌదరి. అనంతరం తిరిగి హల్వారా నుంచి సూరత్‌గఢ్‌కు వెళ్తుండగా బాగ్‌పురనా ప్రాంతంలో విమానం కుప్పకూలింది, అభినవ్ చౌదరి కి వివాహం అయ్యి ఒక సంవత్సరం పూర్తయింది.

అభినవ్ తల్లిదండ్రులు భార్య

Abhinav chowdary మృతదేహం విమానం కూలి పోయిన దగ్గరుండి రెండు కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది, ఆయన పారాషూట్ ఓపెన్ అయినా క్రష్ ల్యాండ్ అవడంతో మెడ విరిగి ఆయన మరణించారు.

విమానం కూలి పోయిన ప్రదేశం

యుద్ధ విమానం జనాల నివాసానికి 200 మీటర్లు దూరంలో కూలి పోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు,ఈ ఏడాది ఇది మూడో ప్రమాదం. మార్చ్ లో మధ్యప్రదేశ్‌లోని ఓ ఎయిర్ బేస్‌ నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో మిగ్ విమానం కుప్పకూలింది, ఆ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ గుప్తా మరణించారు,జనవరిలోనూ రాజస్థాన్‌లో సూరత్‌గఢ్‌లో ఓ మిగ్ యుద్ధ విమానం కూలిపోగ ఈ సంఘటన లో పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు, అయితే ఇప్పుడు అభినవ్ చౌదరి ఫోటోలు అందరు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ట్విట్టర్లో గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని వేడుకుంటున్నారు.

Categories
general

మద్యం చుక్క తాగిన రెండు చుక్కలు తాగిన లోపల సంక నాకి పోతుంది.

మద్యం త్రాగడానికి సరదాగానే ఉంటుంది,మద్యం ఆరోగ్యానికి హానికరం అన్నారేగాని, చిన్న మోతాదులో తాగితే ఏమి కాదు, ఎక్కువ మాతాదులో తాగితే హానికరం అని ఎవరు చెప్పారు, మద్యం ఎంత తాగినా ఆరోగ్యానికి హానికరమే,మద్యం తాగితే డేంజరని అందరికీ తెలుసు,కానీ చాలా మంది తాగడమే గొప్పగా ఫీల్ అవుతూ తాగేస్తున్నారు ఈ రోజుల్లో మద్యం తాగితే మన బాడీ బయట పెద్దగా మార్పులేవీ కనిపించవు కానీ బాడీ లోపల ఉండే పార్టులకు తీవ్రమైన హాని తప్పదు. శ‌రీరంలోని అన్ని భాగాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఇప్ప‌టికే ప‌లు అధ్య‌య‌నాల్లో వెల్లడైంది. ప‌లువురు నిపుణులు సైతం ఈ విష‌యాన్ని తేల్చిచెప్పారు. అయితే మ‌ద్యం ప్రియులు మాత్రం త‌మ‌కు తాము స‌ర్దిచెప్పుకుంటారు,కొంచెం మొత్తంలో మ‌ద్యం తాగితే ఆరోగ్యానికి మంచిద‌ని ఫీలవుతుంటారు.మ‌ద్యం తీసుకునే ప‌రిమాణంతో సంబంధం లేకుండా అది మెద‌డు ఆరోగ్యాన్ని దెబ్బ‌తిస్తుంద‌ని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది,ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు ఇంగ్లండ్‌కు చెందిన సుమారు 25000 మందిపై ప‌రిశోధ‌న‌లు జ‌రిపిన త‌ర్వాత ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. మద్యం తాగడం వల్ల బాడీ లోపల ఉండే పార్టులకు తీవ్రమైన హాని తప్పదు. ముఖ్యంగా మతిమరుపు, గుండె, ఊపిరి తిత్తులు, కాలేయం, పేగులు ఇలా కీలకమైన అవయవాలన్నీ దెబ్బతినేస్తాయ,మద్యం తాగుతూ పైకి హీరోలా ఉండే చాలా మందికి లోపల అడ్డమైన రోగాలూ ఉన్నట్లే లెక్క ఏదో ఒక రోజు ఆరోగ్యం చెడి డాక్టర్ దగ్గరకు వెళ్తేగానీ అసలు విషయం తెలియదు.( అచ్చ తెలుగులో చెప్పాలంటే మద్యం తాగితే సంక నాకి పోతారు)

 

Categories
general

మెంతులు మనిషి శరీరానికి ఒక దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఔషధం.

1.డయాబెటిస్ లేదా మధుమేహాన్ని అదుపు చేస్తాయి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు తరచూ మెంతులను వాడమని సలహా ఇస్తారు ఎందుకంటే దీనిలో మధుమేహాన్ని నియంత్రణ చేసే శక్తి ఉంది కాబట్టి శరీరంలో చెడు కొవ్వులను సైతం మెంతులు తొలగిస్తాయి. మెంతుల్లో ఉండే 4-హైడ్రోక్సీసొలేయూసీనే అనే అమినో యాసిడ్లలో యాంటీ డయాబెటిక్‌లు ఉన్నాయి,

ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి కాబట్టి ఫలితంగా రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి,మెంతుల టీ లేదా మెంతులను పెరుగులో కలిసి రోజు రెండు సార్లు తీసుకున్న మంచి ఫలితం ఉంటుందట,టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే గుణం ఉందని అధ్యయనాల్లో తేలింది”.

2.”కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మెంతులలో నారింజనీన్ అనే ఫ్లవనాయిడ్స్ ఉండటం వల్ల అది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని అధ్యయనాల్లో తేలింది,గుండె పనితీరును మెరుగు పరుస్తుంది మెంతులు గుండెలోని రక్తనాళాల పనితీరును బాగా మెరుగు పరుస్తుంది,

గుండెపోటు రావడానికి ముఖ్యమైన కారణం గుండె కవాటాలు మూసుకుపోవడం, అయితే ఒకవేళ అప్పటికే కొంత హాని జరిగినా మెంతుల వల్ల ఇకపై గుండెకు హాని జరగకుండా చూస్తుంది “

3.మహిళలకు నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులను తగ్గిస్తుంది మెంతులు నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, నొప్పులు మరియు ఇతర ఇబ్బందులను తగ్గించడానికి సహకరిస్తాయి,మెంతులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మరియు నొప్పులను

నివారించే గుణాల వల్ల నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరులు, కడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి తగ్గుతాయని అధ్యయనాల్లో తేలింది అంతే కాదు, మెంతుల పొడి తల నొప్పి, వికారం వంటి సమస్యలకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది

4.”పాలిచ్చే తల్లులలో పాల సామర్ధ్యాన్నిపెంచుతాయి,ఈ మెంతులలో తల్లిపాల ఉత్పత్తికి కారణమయ్యే ఫైటోఈస్ట్రోజెన్ ఉండటం వల్ల పాలిచ్చే తల్లులలో ఇది పాలసామర్ధ్యాన్నిపెంచడానికిఉపయోగపడుతుంది,మెంతులను తీసుకుని నెయ్యిలో దోరగా వేయించాలి. ఇలా వేయించిన మెంతులను పొడిగా చేయాలి చేసి తర్వాత ఈ పొడికి సమానంగా గోధుమ పిండి కలిపి రుచికి సరిపడా చక్కెర కలపాలి.

Mother image

ఇలా తయారైన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బాలింతలకు బాగా పాలు ఉత్పత్తి అవుతాయి,కేవలం మెంతులే కాదు మెంతి కూరను తినడం వల్ల అనుకున్న ఫలితాలు వస్తాయి,కాబట్టి ప్రసవం అనంతరం మహిళలు మెంతులను తీసుకోవాలని చెబుతు ఉంటారు .” ఇలాంటి వన్నీ మన ఇంట్లో పెద్ద వారు ఉంటే చెప్తూ ఉంటారు.

Categories
general health

ఈ దనియాల కి ఎన్ని ఆరోగ్య సూత్రాలు.

వంట గదిలో మన ముందు ఎన్నో ఔషధాలు ఉంటాయి. కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలీదు, మనం ఉపయోగించే వంట లో చాలా రాక రకాల పదార్థాలు వాడుతుంటాం, అందులో ముఖ్యంగా ధనియాలు గింజలను కూరపొడి, సాంబారు పొడి తయారీలకు, కూరల తాళింపుకోసం వాడటం ఒక నవాయితిధనియాలు ప్రతిఒక్కరి ఇంట్లో ఉంటాయి. వీటిల్లో విటమిన్ ఎ, సీ, కె పుష్కలంగా ఉంటాయి. ధనియాలను ఏ రకంగానైనా తీసుకోవచ్చు. నీటిలో ధనియాలు వేసి మరగబెట్టి తాగొచ్చు. పౌడర్‌ను నీటిలో కలుపుకోని కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న ధనియాల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు,గ్యాస్‌నుంచి ఉపశమనం కలిగించేదిగా) పనిచేస్తుందని తేలింది. అలాగే రిఫ్రిజిరెంట్‌గా (శరీరాన్ని చల్లపరిచేదిగా), డైయూరిటిక్‌గా (మూత్రాన్ని జారిచేసినదిగా), ఏఫ్రోడైజియాక్‌గా (లైంగిక శక్తిని పెంచేదిగా), ఇన్ని సుగుణాలున్న ధనియాలను చూస్తుంటే ప్రకృతి ప్రసాధించిన ఒక వరంగా మనం భావించాలి.”దనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది, జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో ఏలికపాముల్ని బయటకు పంపుతుంది.ఈ ధనియాల పిండిని ఆయుర్వేద రంగంలో జుట్టు, చర్మ మరియు నోటి సంబంధిత రోగాలకు గొప్ప చికిత్సకారిణిగా వినియోగించడం సాధారణం.

Categories
general world

కారు 25 కోట్లు ఓకే, కానీ దాని నెంబర్ 52 కోట్లు ఏంటి..?

మన మామూలు కారు కొంటేనే మంచి నెంబర్ కోసం వెతుకుతాం, దాని గురించి చాలా ప్రయత్నిస్తాం, మనదేశంలో ఫ్యాన్సీ నెంబర్లు వేలం పాట పాడుకుంటూ ఉంటారు,చాలామంది ఫ్యాన్సీ నెంబర్ కోసం లక్షలు వేచించి మరి కొనుక్కుంటారు, ఆ నెంబర్ కొంత మంది లక్కీ గా భావిస్తారు, మరికొంతమంది స్టేటస్ సింబల్ గా భావిస్తారు,ఇలాంటి సాంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా ఉంది,ఇప్పుడు హై అండ్ రేంజ్ కార్లు ఉన్నవాళ్ళు ఫ్యాన్సీ నెంబర్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు,ఇప్పుడు మీరు చూస్తున్న కారు అక్షరాల 25 కోట్లు, ఎంత ఖరీదైన కారు అంటే దానికి ఎన్ని హంగులు ఉన్నాయో, వారికి ఎంత డబ్బు ఉందో,సరే బాగా డబ్బు ఉండి ఖరీదైన కారు కొనుక్కున్నారు, కానీ దాని నెంబర్ ప్లేట్ 52 కోట్లు వెచ్చించి కొన్నారు, అవును ఇది నిజమే అక్షరాల 52 కోట్లు,కారు పెట్టిన ఖర్చు కన్నా ఈ నెంబర్ పై పెట్టిన ఖర్చు డబ్బులు కానీ ఎక్కువ,ఇంతకీ అలా లక్కీ నెంబర్ ఎంత తెలుసా, నెంబర్ 9, ఇప్పుడు ఈ కార్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,”రిజిస్ట్రేషన్ ప్లేట్ యొక్క ధర దాని సంఖ్యల పరిమాణంపై ఆధారపడి ఉంటుంది,కాబట్టి ఈ బుగట్టి చిరోన్ నంబర్ ప్లేట్‌లో ఒకే నంబర్ మాత్రమే కలిగి ఉంది,అందుకే దీనికి ఇంత ఖరీదు అవుతుంది. ఎక్కువ సంఖ్యలను కలిగి ఉన్న నంబర్ ప్లేట్‌ను ఎంచుకుంటే దానికి తక్కువ ఖర్చు అవుతుంది. అదేవిధంగా కాలం గడుస్తున్న కొద్దీ అలాంటి ప్రత్యేక నంబర్ ప్లేట్ల ధర పెరుగుతూనే ఉంటుంది.” ఇలాంటి నెంబర్ ప్లేట్ల మీద పెట్టుబడి పెట్టే వారు చాలామంది ఉంటారు, ఎందుకంటే భవిష్యత్తులో ఈ నెంబర్ ప్లేట్ లో వ్యాల్యూ పెరుగుతూనే ఉంటుంది.

Categories
general

భారతదేశంలో ఈ రైల్వే స్టేషన్ కి పేరు లేదు……. ఎందుకంటే.

ఆసియా రైల్వేలో రెండవ అతి పెద్ద నెట్వర్క్ కలిగిన దేశం మన భారతదేశం,దేశవ్యాప్తంగా ఎనిమిది వేల రైల్వేస్టేషన్లు పైగా ఉన్నాయి,దేశంలో కొన్ని ప్రత్యేక రైల్వే స్టేషన్ కు అలాగే ట్రైన్స్ కు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అలాగ ప్రత్యేకతలు ఉన్న వాళ్ల గురించి జనం ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటారు,అలాగే జనాలు చెప్పుకునే రైల్వేటేషన్ ఒకటి ఉంది, ఎందుకంటే ఆ రైల్వే స్టేషన్ కి పేరు లేదు,అవును మేము చెప్పేది నిజమే, నిజంగా ఆ రైల్వే స్టేషన్ కి పేరు లేదు, ఈ రైల్వే స్టేషన్ 2008లో నిర్మించారు, దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్ ఆద్ర రైల్వే డివిజన్ లో ఉంది.బంకురా-మసాగ్రామ్ రైలు మార్గంలో ఉన్న ఈ స్టేషన్ రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్యలో వుంది,ఈ స్టేషన్ ప్రారంభంలో రైనాగర్ అని పిలువబడేది, కానీ రైనా గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకించి తమ గ్రామం పేరును ఈ స్టేషన్ పేరుగా పెట్టాలని డిమాండ్ చేయడంతో రెండు గ్రామాల ప్రజల మధ్య గొడవ ప్రారంభమైంది,ఈ విషయం తెలుసుకున్న రైల్వే బోర్డ్ వారి మధ్యలో గొడవలు పరిష్కరించడానికి రైల్వే బోర్డు పై పేరు తీసేసింది, రైల్వే స్టేషన్ నికి పేరు లేకపోవడం వల్ల ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు, తోటి ప్రయాణికుల అడిగి ఆ స్టేషన్ పేరు తెలుసుకుంటున్నారు,అయితే ఇప్పటికీ పాత పేరు రైనా నగర్ మీదే టికెట్లు విక్రయిస్తుంది రైల్వే శాఖ.