Categories
politics

ఎమ్మెల్యేని బట్టలు చింపి పరిగెత్తించి మరి కొట్టిన రైతులు

కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా మాట్లాడుతున్న ఎమ్మెల్యే పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యేపై విచక్షణా రహితంగా దాడి చేశారు,పంజాబ్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఆయనపై దాడి జరిగింది. కొందరు ఆందోళన కారులు ఆయన దుస్తులను చింపి చితకబాదారు. పోలీసులు సమక్షంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన అబోహర్ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ శనివారం మలోట్ పట్టణానికి వెళ్లారు. అక్కడి బీజేపీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి పంజాబ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని అనుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. రైతులను చూసి ఎమ్మెల్యే నారంగ్‌ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు పరుగెత్తారు. వారి వెంట రైతులు కూడా వెళ్లారు. అక్కడే ఉన్న ఆందోళనకారులు ఎమ్మెల్ పై విరుచుకుపడ్డారు. ఆయన దుస్తులు చింపేసి విచక్షణా రహితంగా దాడి చేశారు,పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. బట్టలు పూర్తిగా చినిగిపోవడంతో ఆయనకు నడిరోడ్డుపై ఘోరమైన అవమానం జరిగింది. పోలీసుల భద్రత మధ్య ఆయన బీజేపీ కార్యాలయంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేపై జరిగిన ఈ దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Categories
general

స్క్రాప్ డీలర్ భార్యకి కోటి రూపాయల లాటరీ

ఏ క్షణం ఎవరిని అదృష్టం వరిస్తుందో ఎవరూ చెప్పలేరు, అనుకోకుండా వచ్చే అదృష్టానికి కొందరు మాత్రమే అర్హులు అవుతూ ఉంటారు. దానికి కూడా సరైన సమయం రావాలంటారు. పంజాబ్ లో  తుక్కు సామాన్లు అమ్మే డీలర్ భార్యకు లాటరీలో కోటి రూపాయలు వచ్చాయి, బాగ్ పుర్ణాల్లో నివసించే స్క్రాప్ డీలర్ భార్య ఆశ వాణి జాక్పాట్ కొట్టేసింది. పంజాబ్ స్టేట్ డియర్ మంత్లీ లాటరీ మీద ఈ ప్రైజ్ మొత్తం లభించింది. ఈమె లాటరీ అధికారులకు తన దగ్గర ఉన్న లాటరీ టికెట్ చూపి దానికి తగ్గ డాక్యుమెంట్స్ కూడా సమర్పించింది. ప్రైజ్  లభించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తన జీవితంలో ఇలా పెద్దమొత్తంలో లాటరి రూపంలో తగ్గించుకుంటాను అని కలలో కూడా అనుకోలేదు అని తెలిపింది. ఇది నాకు నా కుటుంబానికి తగిలిన అదృష్టం అని ఆశా రాణి వ్యక్తం చేశారు. తన ఇల్లు చిన్నది అని తన కుటుంబానికి సరిపోవడం లేదు,అని ఈ లాటరీ డబ్బులతో తన ఇల్లు పెద్దది చేసుకుంటానని తెలిపింది, మిగిలిన డబ్బులతో స్క్రాప్  వ్యాపారం పెంచుకుంటాం అని తెలిపింది.

Categories
general home

ఒక గ్రామం కోసం 12 గ్రామాలు పాకిస్తాన్ కు ఇచ్చేసిన భారత్

భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే  పరిస్థితులు ఉన్నాయి,  అది ఇది ఏమీ లేదు చిన్న కారణం దొరికితే చాలు పాకిస్తాన్ ఇండియా వైపు కాలు దువ్వుతూ నే ఉంటుంది, ముఖ్యంగా కాశ్మీర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  ఈ వివాదాలు పక్కన పెడితే. మన దేశం కాంప్రమైజ్ ఒక గ్రామం కోసం 12 గ్రామాలను పాకిస్తాన్ కి ఇచ్చేసింది, ఇది నిజమే, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనకాల చాలా పెద్ద కారణమే ఉంది, భారత దేశానికి పాకిస్తాన్ కి సరిహద్దు సమీపంలో వొసని వాలా అనే గ్రామం ఉంది, ఇది ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఫిరోజ్ పూర్ జిల్లా సరిహద్దు లోకి వస్తుంది. భగత్ సింగ్, సుకుదేవ్, రాజ్ గురు సమాధులు ఈ గ్రామంలోనే ఉన్నాయి, అలాగే పంజాబ్ మాత బిరుదు పొందిన భగత్ సింగ్ తల్లి విద్యావతి సమాధి కూడ  ఈ గ్రామంలోనే ఉన్నది, అయితే ఈ గ్రామం దేశ విభజన  అనంతరం పాక్ భూభాగంలోని కి వెళ్ళిపోయింది. దానితో భారతదేశం తన 12 గ్రామాలు పాక్ ఇచ్చి ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా తీసుకుంది. ఈ గ్రామం స్వతంత్ర సమరయోధులు, అమరవీరులు గుర్తులు  ఉన్న చరిత్రాత్మక కావడం భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Categories
movies

ఈనెల 29న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో పండగ

ఈనెల 29న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో పండగ రాబోతుంది

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. తమ అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని తిరిగి సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు చూస్తామా అని. రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్‌తో తిరిగి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఏప్రిల్ 9న ఈ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. సినిమాకు సాధారణ హిట్ టాక్ వచ్చినా, రికార్డులు పేలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది పవన్ ఫ్యాన్స్ ఆరాటం చూస్తుంటే.పవన్‌కళ్యాణ్‌, శ్రీరామ్‌ వేణు కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ప్రతి కంటెంట్‌ అందర్నీ విశేషంగా అలరిస్తున్నాయి. దీంతో ఈ సినిమా కోసం పవన్‌ అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు

ఈ నేపథ్యంలో అందరిలో మరింత క్యూరియాసిటీని పెంచడానికి ఈనెల 29న ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేస్తున్నట్టు చిత్ర బృందం ఎనౌన్స్‌ చేసింది. అంతేకాదు ఈ ఎనౌన్స్‌మెంట్‌తో పాటు లాయర్‌ గెటప్‌లో పవర్‌ఫుల్‌ లుక్‌తో ఉన్న పవర్‌స్టార్‌ స్టిల్‌ని సైతం రిలీజ్‌ చేసింది. దిల్‌ రాజు-శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది

‘పింక్’ మూవీ తెలుగు రీమేక్‌గా ఈ ‘వకీల్ సాబ్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు శ్రీరామ్ ఈ సినిమాని తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అంజలి, నివేత థామస్, అనన్య నాగేళ్ల కీ రోల్స్‌లో కనిపించనున్నారు.

Categories
general

నేడు భగత్ సింగ్, సుకుదేవ్,రాజుగురుల బలిదానం జరిగిన రోజు. అమరవీరుల దినోత్సవం

మీ త్యాగం మా ఆనందమయ జీవితానికి సోపానం
మీ బలిదానం మరువదు ఈ దేశం 


నేడు భగత్ సింగ్, సుకుదేవ్,రాజుగురుల బలిదానం జరిగిన రోజు. అమరవీరుల దినోత్సవం


పరాయి పాలన నుండి దేశ విముక్తి కొరకు అతి చిన్న వయసులోనే ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన యువ వీరులు, భారతమాత ప్రియ పుత్రులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను సంస్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నది
Categories
movies

ఉత్తమ తెలుగు చిత్రం’గా నాని హీరోగా ‘జెర్సీ’ మూవీ ఎంపికయ్యింది.

న్యూఢిల్లీలో ఈరోజు ప్రకటించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘ఉత్తమ తెలుగు చిత్రం’గా నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ‘జెర్సీ’ మూవీ ఎంపికయ్యింది. ఈ ఫిల్మ్‌ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇదే సినిమాకు ‘ఉత్తమ ఎడిటర్’గా నవీన్ నూలికి అవార్డు లభించింది. ఒక లక్ష్యం కోసం ఎన్నడో వదిలేసిన క్రికెట్‌ను మళ్లీ ఆడిన అర్జున్ అనే క్రికెటర్ కథగా ఈ మూవీ రూపొందింది

వాస్తవానికి 2020లో ప్రకటించాల్సిన ఈ అవార్డులను కరోనా మహమ్మారి కారణంగా వాయిదా వేశారు. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఈ పురస్కరాలను ప్రకటించింది.

మణికర్ణిక సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపిక చేశారు,ఉత్తమ నటుడు కేటగరీలో మనోజ్ బాజ్‌పాయ్, ధనుష్‌ను సంయుక్తంగా ప్రకటించారు. జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా సూపర్ డిలాక్స్‌లో నటనకు గానూ విజయ సేతుపతి ఎంపికయ్యారు. ఉత్తమ హిందీ చిత్రంగా చిచోరే నిలిచాయి. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘జల్లికట్టు’ మలయాళం చిత్రం దక్కించుకుంది.జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా కస్తూరి ఎంపికైంది.

Categories
movies

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ‘మహర్షి’ చిత్రం రెండు నేషనల్‌ అవార్డ్స్‌ వరించాయి.

67వ జాతీయ అవార్డులను కేంద్ర ప్రకటించగా.. అందులో సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ‘మహర్షి’ చిత్రం రెండు, న్యాచురల్ స్టార్ నాని ‘జెర్సీ’ చిత్రానికి రెండు నేషనల్‌ అవార్డ్స్‌ వరించాయి. టాలీవుడ్‌ వ్యాప్తంగా ఈ రెండు చిత్రాల యూనిట్‌లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

మహేశ్ టైటిల్ పాత్రధారిగా వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ‘మహర్షి’ మూవీ ‘పూర్తి స్థాయిలో వినోదాన్ని అందించిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌’గా అవార్డును కైవసం చేసుకుంది. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ఇదే చిత్రానికి రాజు సుందరంకు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు కూడా లభించింది. మిలియనీర్ అయిన రిషి అనే బిజినెస్‌మ్యాన్ తన మాతృభూమికి వచ్చి పేద రైతులకు అండగా నిలిచి ఎలా ‘మహర్షి’గా పేరు తెచ్చుకున్నాడనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం.

మణికర్ణిక సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎంపిక చేశారు,ఉత్తమ నటుడు కేటగరీలో మనోజ్ బాజ్‌పాయ్, ధనుష్‌ను సంయుక్తంగా ప్రకటించారు. జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా సూపర్ డిలాక్స్‌లో నటనకు గానూ విజయ సేతుపతి ఎంపికయ్యారు. ఉత్తమ హిందీ చిత్రంగా చిచోరే నిలిచాయి. ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా ‘జల్లికట్టు’ మలయాళం చిత్రం దక్కించుకుంది.జాతీయ ఉత్తమ బాలల చిత్రంగా కస్తూరి ఎంపికైంది.

Categories
Uncategorized

Jathi ratnalu movie beats baahubali records